Karimnagar: స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:46 PM
కరీంనగర్ అర్బన్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
కరీంనగర్ అర్బన్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం జరిగే వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభవ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు. జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, కలెక్టర్, పోలీస్‌కమిషనర్, ఇతర నాయకులు, అధికారులు హాజరుకానున్నారు. ఉదయం 9:30కు మంత్రి శ్రీధర్‌బాబు జాతీయ పతకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసుల నుంచి మంత్రి గౌరవవందనం స్వీకరించనున్నారు. 9:30 నుంచి 10 గంటల వరకు మంత్రి సందేశం ఉంటుంది. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానుం, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రంగాల్లో కృషి చేసిన, సేవలు అందించినవారికి ప్రశంసాపత్రాలు, మెమెంటోలను అందజేస్తారు. 11 నుంచి 11:40 గంటల వరకు వివిధ శాఖల స్టాల్స్‌ను మంత్రితతోపాటు ఎమ్మెల్యేలు, అధికారులు సందర్శిస్తారు. అనంతరం అస్త్ర కన్వెన్షన్ హాల్‌లో మంత్రికి, ఇతర అథితులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర వేడుకలు నిర్వహించే పరేడ్ గ్రౌండ్‌లోని వేదికతోపాటు మైదానాన్ని గురువారం పోలీస్ డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీ చేశారు. వేదికతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కూర్చునేందుకు టెంట్, సోఫాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు.