Karimnagar: మానేరు రిఫర్ ఫ్రంట్‌పై విచారణ జరిపించాలి
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:28 AM
భగత్‌నగర్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ మానేరు రివర్‌ఫ్రంట్ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు.
- సీఎంకు వినతిపత్రం అందించిన చాడ
భగత్‌నగర్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ మానేరు రివర్‌ఫ్రంట్ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్‌లో మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల పేరుతో గత ప్రభుత్వం 500 కోట్లు మంజూరు చేసిందన్నారు. అందులో టూరిజం శాఖ 100 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ పనులను తమ అనుచరులకు అప్పగించిందన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించారన్నారు. పనులు పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించారన్నారు. రివర్‌ఫ్రంట్ పరిధిలో చెక్‌డ్యాములు నిర్మిస్తే వర్షాకాలంలో అవి పూర్తిగా కొట్టుకుపోయాయన్నారు. చెక్ డ్యాములు కొట్టుకుపోయిన తరువాత కూడా రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులకు నిధులు విడుదల చేశారన్నారు. ఐదు సంవత్సరాలు గడుస్తున్నా పనులు పూర్తి కాలేదన్నారు. రివర్‌ఫ్రంట్ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరారు.