Share News

Karimnagar: ఎల్‌ఎండీ వరద పరిస్థితిని సమీక్షించిన అదనపు కలెక్టర్‌

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:54 AM

తిమ్మాపూర్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ పరిధిలోని దిగువ మానేరు జలాశయాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ ఆశ్విని తానాజీ వాకడే గురువారం సందర్శించారు.

Karimnagar:  ఎల్‌ఎండీ వరద పరిస్థితిని సమీక్షించిన అదనపు కలెక్టర్‌

తిమ్మాపూర్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ పరిధిలోని దిగువ మానేరు జలాశయాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ ఆశ్విని తానాజీ వాకడే గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎల్‌ఎండిలోకి వస్తున్న వరద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌ఎండిలోకి 55వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తునందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తూ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను అదేశించారు. కార్యక్ర మంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ పెద్ది రమేష్‌, డిఈ శ్రీనివాస్‌, వేణుగోపాల్‌, ఏఈ వంశీధర్‌ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2025 | 12:54 AM