Karimnagar: బొమ్మలకుంట చెరువును పరిశీలించిన అదనపు కలెక్టర్
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:52 AM
తిమ్మాపూర్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొల్లపల్లి గ్రామంలో భారీ వర్షానికి బుధవారం బొమ్మలకుంట చెరువు కట్టతెగింది.
తిమ్మాపూర్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొల్లపల్లి గ్రామంలో భారీ వర్షానికి బుధవారం బొమ్మలకుంట చెరువు కట్టతెగింది. గురువారం అదనపుకలెక్టర్ లక్ష్మికిరణ్, ఆర్డీవో మహేశ్వర్, ఇతర అధికారులతో కలిసి తెగిన కట్ట ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రతీ వర్షాకాలం చెరువు కట్ట తెగిపోతున్నా అధికారులు తాత్కాలిక మర మ్మతులు చేస్తున్నారని అన్నారు. దీంతో ప్రతిసారి వర్షానికి చెరువుకట్ట తెగిపోతోందని, శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు, రైతులు అద నపు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే చెరువు కట్టకు శాశ్వత మరమత్ములు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆమె ఆదేశించారు.