karimnagar : ‘పంచాయతీ’ ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:54 AM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారయంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
- సర్పంచు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు
- త్వరలో నోటిఫికేషన విడుదల
- గ్రామాల్లో వేడెక్కుతున్న రాజకీయం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారయంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ పోరులో కీలకఘట్టమైన రిజర్వేషన్ల ప్రక్రియను ఆదివారం పూర్తి చేశారు. జిల్లాలోని 318 గ్రామపంచాయతీల సర్పంచులు, 2,962 వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. కరీంనగర్, హుజూరాబాద్ డివిజన్ల పరిధిలోని సర్పంచులకు ఆర్డీవోలు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. త్వరలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన విడుదలవుతుందనే ప్రచారం జరుగుతుండడంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న చోట నాయకులు పోటీకి సిద్ధమవుతుండగా అనుకూలంగా రిజర్వేషన్లు రానివారు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో అవకాశం వస్తే పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు చేస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలించని నాయకులు తమకు అనుకూలమైన వారిని బరిలో నిలిపి వారిని గెలిపించుకోవడం ద్వారా గ్రామాల్లో పట్టునిలుపుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ డివిజన పరిధిలో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, చొప్పదండి, రామడుగు, గంగాధర, తిమ్మాపూర్, మానకొండూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాలు ఉన్నాయి. హుజూరాబాద్ రెవెన్యూ డివిజన పరిధిలోని సైదాపూర్, వీణవంక, హుజురాబాద్, శంకరపట్నం, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో 140 గ్రామపంచాయతీలు, 1285 వార్డు సభ్యులు ఉండగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటికే గ్రామపంచాయతీల వారిగా కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. గ్రామం యూనిట్‌గా ఓటర్ల జాబితాను గ్రామ కార్యదర్శులు సిద్ధం చేశారు.
ఫ జిల్లాలో 10,82,751 మంది ఓటర్లు
ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 10,82,751 మంది ఓటర్లు ఉండగా, వారిలో 5,30,337 మంది మహిళలు, పురుష ఓటర్లు 5,52,353 మంది, ఇతరులు 61 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఆదివారం వరకు గ్రామాల్లో ఓటరు జాబితాను సవరించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఓటర్ల సంఖ్య కొంత తారుమారు అయ్యే అవకాశాలుంటాయని చెబుతున్నారు. ‘పంచాయతీ’ ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు
- సర్పంచు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు
- త్వరలో నోటిఫికేషన విడుదల
- గ్రామాల్లో వేడెక్కుతున్న రాజకీయం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారయంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ పోరులో కీలకఘట్టమైన రిజర్వేషన్ల ప్రక్రియను ఆదివారం పూర్తి చేశారు. జిల్లాలోని 318 గ్రామపంచాయతీల సర్పంచులు, 2,962 వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. కరీంనగర్, హుజూరాబాద్ డివిజన్ల పరిధిలోని సర్పంచులకు ఆర్డీవోలు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. త్వరలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన విడుదలవుతుందనే ప్రచారం జరుగుతుండడంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న చోట నాయకులు పోటీకి సిద్ధమవుతుండగా అనుకూలంగా రిజర్వేషన్లు రానివారు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో అవకాశం వస్తే పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు చేస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలించని నాయకులు తమకు అనుకూలమైన వారిని బరిలో నిలిపి వారిని గెలిపించుకోవడం ద్వారా గ్రామాల్లో పట్టునిలుపుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ డివిజన పరిధిలో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, చొప్పదండి, రామడుగు, గంగాధర, తిమ్మాపూర్, మానకొండూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాలు ఉన్నాయి. హుజూరాబాద్ రెవెన్యూ డివిజన పరిధిలోని సైదాపూర్, వీణవంక, హుజురాబాద్, శంకరపట్నం, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో 140 గ్రామపంచాయతీలు, 1285 వార్డు సభ్యులు ఉండగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటికే గ్రామపంచాయతీల వారిగా కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. గ్రామం యూనిట్‌గా ఓటర్ల జాబితాను గ్రామ కార్యదర్శులు సిద్ధం చేశారు.
ఫ జిల్లాలో 10,82,751 మంది ఓటర్లు
ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 10,82,751 మంది ఓటర్లు ఉండగా, వారిలో 5,30,337 మంది మహిళలు, పురుష ఓటర్లు 5,52,353 మంది, ఇతరులు 61 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఆదివారం వరకు గ్రామాల్లో ఓటరు జాబితాను సవరించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఓటర్ల సంఖ్య కొంత తారుమారు అయ్యే అవకాశాలుంటాయని చెబుతున్నారు.
ఫ జిల్లాలోని సర్పంచల రిజర్వేషన్ల వివరాలు
- కరీంనగర్ మండలం: బహద్దూర్‌ఖానపేట, చేగుర్తి, మందులపల్లి (జనరల్ మహిళ), చర్లబూత్కూర్, ఇరుకుల్ల, తాహెరకొండాపూర్, దుబ్బపల్లి (జనరల్), ముగ్దుంపూర్ (ఎస్సీ మహిళ), ఎలబోతారం, నల్లగుంటపల్లి (ఎస్సీ జనరల్), చామనపల్లి, జూబ్లీనగర్ (బీసీ జనరల్), ఫకీర్‌పేట, నగునూర్ (బీసీ మహిళ)
- కొత్తపల్లి మండలం: ఆసీఫ్‌నగర్, కాజీపూర్, నాగులమల్యాల (జనరల్), బద్దిపల్లి (ఎస్సీ జనరల్), ఎలగందల్ (బీసీ జనరల్), కమానపూర్ (బీసీ మహిళ)
- చొప్పదండి మండలం: ఆర్నకొండ, మంగళ్లపల్లి (ఎస్సీ మహిళ), భూపాలపట్నం, గుమ్లాపూర్ (ఎస్సీ జనరల్), దేశాయిపేట, రుక్మాపూర్ (బీసీ మహిళ), రాగంపేట, వెదురుగట్ట (బీసీ జనరల్) చాకుంట, పెద్ద కురుమపల్లి, చిట్యాలపల్లి, సాంబయ్యపల్లి (జనరల్ మహిళ), కాట్నపల్లి, కొలిమికుంట, కోనేరుపల్లి, రేవల్లి (జనరల్)
- రామడుగు మండలం: షానగర్, రుద్రారం, కొక్కెరకుంట (ఎస్సీ మహిళ), కిష్టాపూర్ , గుండి, వెదిర (ఎస్సీ జనరల్), వెంకట్రావుపల్లి, దేశరాజ్‌పల్లి బీసీ (మహిళ), రాంచంద్రాపూర్, వన్నారం, రంగసాయిపల్లి (బీసీ జనరల్), పందికుంటపల్లి, మోతె, కొరటపల్లి, గోపాల్‌రావుపేట, దత్తోజిపేట, శ్రీరాములపల్లి (జనరల్ మహిళ), గోలిరామయ్యపల్లి, రామడుగు, తిర్మలాపూర్, వెలిచాల, చిప్పకుర్తి, లక్ష్మీపూర్ (జనరల్)
- తిమ్మాపూర్ మండలం: వచ్చునూర్, మహాత్మానగర్, మొగిలిపాలెం (బీసీ జనరల్), పర్లపల్లి, మన్నెంపల్లి, గొల్లపల్లి (బీసీ మహిళ), జుగుండ్ల, కొత్తపల్లి (ఎస్సీ మహిళ), రేణికుంట, నల్లగొండ, పొరండ్ల (ఎస్సీ జనరల్), నేదునూరు, రామకృష్ణకాలనీ, రాంహన్మాననగర్, మల్లాపూర్, నుస్తులాపూర్, పోలంపల్లి (జనరల్ మహిళ), ఇందిరానగర్, మక్తాపల్లి, నర్సింగాపూర్, తిమ్మాపూర్, బాలయ్యపల్లి, లక్ష్మీదేవిపల్లి (జనరల్)
- చిగురుమామిడి మండలం: బొమ్మనపల్లి, ముల్కనూర్ (ఎస్సీ మహిళ), ముదిమాణిక్యం, ఉల్లంపల్లి (ఎస్సీ జనరల్), చిగురుమామిడి, నవాబుపేట (బీసీ మహిళ), ఇందుర్తి, రేకొండ (బీసీ జనరల్), గాగిరెడ్డిపల్లి, ఒగులాపూర్, సీతారాంపూర్, సుందరగిరి (జనరల్ మహిళ), గునుకులపల్లి, కొండాపూర్, లంబాడిపల్లి, పీచుపల్లి, రామంచ (జనరల్ )
- గన్నేరువరం మండలం: చాకలివానిపల్లి, మైలారం (ఎస్సీ మహిళ), కాసీంపేట, గునుకుల కొండాపూర్ (ఎస్సీ జనరల్), చీమలకుంటపల్లి, గన్నేరువరం (బీసీ జనరల్), గుండ్లపల్లి ఎక్స్‌రోడ్, గుండ్లపల్లి (బీసీ మహిళ), చొక్కారావుపల్లి, హన్మాజిపల్లి, మాదాపూర్, పీచుపల్లి, యాస్వాడ (జనరల్), గోపాల్‌పూర్, జంగపల్లి, పార్వెల్ల, సాంబయ్యపల్లి (జనరల్ మహిళ)
- గంగాధర మండలం: ఆచంపల్లి, చెర్లపల్లి (ఎన), చిన్న ఆసంపల్లి, గోపాల్‌రావుపల్లి, కాసారం, ఒద్యారం, వెంకంపల్లి, వెంకటాయిపల్లి (జనరల్ మహిళ), చెర్లపల్లి (ఆర్), గర్శకుర్తి, హిమ్మతనగర్, ఇస్లాంపూర్, కొండన్నపల్లి, లక్ష్మీదేవిపల్లి, లింగంపల్లి, మధురానగర్, నర్సింహులపల్లి (జనరల్), బూరుగుపల్లి, సర్వారెడ్డిపల్లి, రంగారావుపల్లి, తాడిజెర్రి, ఉప్పరమల్యాల (బీసీ జనరల్), గంగాధర, గట్టుబూత్కూర్, కాచిరెడ్డిపల్లి, కురిక్యాల, ర్యాలపల్లి (బీసీ మహిళ), కొండయ్యపల్లి, మల్లాపూర్, మంగపేట, ముప్పిడి నర్సింహులపల్లి, (ఎస్సీ జనరల్), నాగిరెడ్డిపూర్, నారాయణపూర్ (ఎస్సీ మహిళ)
- మానకొండూర్ మండలం: గట్టుదుద్దనపల్లి, లలితాపూర్, లింగాపూర్ (ఎస్సీ మహిళ), పచ్చునూర్, రాఘవాపూర్, వన్నారం (ఎస్సీ జనరల్), చంజర్ల, ఖాదర్‌గూడెం, ముంజంపల్లి, బంజేరుపల్లి (బీసీ మహిళ), ఈదులగట్టెపల్లి, లక్ష్మీపూర్, మద్దికుంట, పోచంపల్లి (బీసీ జనరల్), అన్నారం, కెల్లెడు, కొండపల్కల, మానకొండూర్, నిజాయితీగూడెం, శంషాబాద్, ఊటూరు (జనరల్ మహిళ), దేవంపల్లి, గంగిపల్లి, జగ్గయ్యపల్లి, పెద్దూరుపల్లి, రంగపేట, శ్రీనివాస్‌నగర్, వేగురుపల్లి, వెల్ది (జనరల్)
- సైదాపూర్: ఎలబోతారం, అమ్మనగుర్తి, వెన్నంపల్లి, గర్రెపల్లి (ఎస్సీ జనరల్), గొళ్లగూడెం, ఎక్లాస్‌పూర్, సోమారం (ఎస్సీ మహిళ), కురుమపల్లి, వెంకటేశ్వర్లపల్లి, ఘన్‌పూర్, బొమ్మకల్ (బీసీ జనరల్), పెర్కపల్లి, సైదాపూర్, దుద్దెనపల్లి (బీసీ మహిళ), గొడిశాల, గుండ్లపల్లి, నల్లరామయ్యపల్లి, జాగీర్‌పల్లి, రాంచంద్రాపూర్, రాములపల్లి, ఎల్లంపల్లి (జనరల్), ఆకునూర్, ఆరెపల్లి, గుజ్జులపల్లి, రాయికల్, సర్వాయిపేట, వెన్కేపల్లి, లస్మన్నపల్లి (జనరల్ మహిళ), రాయికల్ తండా (ఎస్టీ జనరల్)
- వీణవంక: వీణవంక, వల్బాపూర్, రామకృష్ణాపూర్ (ఎస్పీ మహిళ) ఘన్ముక్ల, పోతిరెడ్డిపల్లి, దేశాయిపల్లి (ఎస్సీ జనరల్), బేతిగల్, ఎల్బాక, మాల్లారెడ్డిపల్లి (బీసీ మహిళ), బొంతుపల్లి, బ్రాహ్మణపల్లి, హిమ్మత్‌నగర్, నర్సింహులపల్లి (బీసీ జనరల్), కొర్కల్, గంగారం, మల్లన్నపల్లి, రెడ్డిపల్లి, కనపర్తి (జనరల్ మహిళ), చల్లూరు, ఇప్పలపల్లి, కొండపాక, లస్మక్కపల్లి, మామిడాలపల్లి, నర్సింగాపూర్, శ్రీరాములపేట, కిష్టంపేట (జనరల్)
- ఇల్లందకుంట: బోగంపాడు, సీతంపేట, వాగొడ్డు రామన్నపల్లె, వంతడుపుల, శ్రీరాములపల్లె (జనరల్ మహిళ), బూజూనూర్, చిన్నకోమటిపల్లి, మర్రివానిపల్లె, పాతర్లపల్లి, రాచపల్లి (జనరల్), ఇల్లందకుంట, కనగర్తి (ఎస్సీ జనరల్), సిరిసేడు (ఎస్సీ మహిళ), గడ్డివానిపల్లె, మల్లన్నపల్లె, టేకుర్తి (బీసీ జనరల్), లక్ష్మాజీపల్లె, మల్యాల (బీసీ మహిళ)
- హుజూరాబాద్ రూరల్: సింగాపూర్, అంబేద్కర్‌నగర్ (ఎస్సీ జనరల్) చెల్పూర్, కనుకులగిద్దె (ఎస్సీ మహిళ), కందుగుల, బొత్తలపల్లి, పెద్దపాపయ్యపల్లి (బీసీ జనరల్) జూపాక, ధర్మరాజుపల్లి, పోతిరెడ్డిపేట, జనరల్ సిర్సపల్లి, శాలపల్లి-ఇందిరానగర్, వెంకట్రావ్‌పల్లి, రాజపల్లి, చిన్నపాపయ్యపల్లి (బీసీ మహిళ), తుమ్మనపల్లి, రంగాపూర్, రాంపూర్, కాట్రపల్లి, మాందాడిపల్లి (జనరల్ మహిళ)
- శంకరపట్నం: అంబేద్కర్ నగర్, గుడాటిపల్లి, లింగాపూర్ (ఎస్సీ మహిళ), కేశవపట్నం, రాజాపూర్, వంకాయగూడెం (ఎస్సీ జనరల్), అంబాలపూర్, గద్దపాక, మెట్‌పల్లి, మొలంగూర్ (బీసీ జనరల్), చింతలపల్లి, కన్నాపూర్, ఎరడపల్లి, జనరల్ ఆముదాలపల్లి, అర్కండ్ల, చింతగుట్ట, ధర్మారం, గొల్లపల్లి, మక్త, ముత్తారం (బీసీ మహిళ), ఇప్పలపల్లి, కాచాపూర్, కల్వల, కరీంపేట, కొత్తగట్టు, నల్లవంకాయపల్లె, తాడికల్ (జనరల్ మహిళ)
- జమ్మికుంట రూరల్: అంకుశాపూర్, గండ్రపల్లి, కోరపల్లి (బీసీ జనరల్), జగ్గయ్యపల్లి, పాపయ్యపల్లి, (బీసీ మహిళ), బిజిగిరిషరీఫ్, నాగారం, పాపక్కపల్లి, పెద్దంపల్లి, వెంకటేశ్వర్లపల్లి (జనరల్ మహిళ), సైదాబాద్, శాయంపేట, తనుగుల, వావిలాల, విలాసాగర్ (జనరల్), మాచనపల్లి, నాగంపేట, నగురం (ఎస్సీ జనరల్), మడిపల్లి, శంభునపల్లి (ఎస్సీ మహిళ)