Share News

karimnagar : చుక్కలు చూపిస్తున్న ‘అబాస్‌’

ABN , Publish Date - Sep 08 , 2025 | 12:54 AM

హుజూరాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): వైద్యారోగ్య శాఖలో ప్రవేశపెట్టిన అబాస్‌(ఆధార్‌ బేస్ట్‌ అటెండెన్స్‌ సిస్టం) సమస్యలమయంగా మారింది.

karimnagar :  చుక్కలు చూపిస్తున్న ‘అబాస్‌’

- యాప్‌లో సాంకేతిక లోపాలు

- ఇబ్బందులు పడుతున్న వైద్య సిబ్బంది

హుజూరాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): వైద్యారోగ్య శాఖలో ప్రవేశపెట్టిన అబాస్‌(ఆధార్‌ బేస్ట్‌ అటెండెన్స్‌ సిస్టం) సమస్యలమయంగా మారింది. పదిహేను రోజుల కిందటి నుంచి ఈ విధానం ఆరోగ్య శాఖలో ప్రవేశపెట్టారు. పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది హాజరును పకడ్బందీగా పర్యవేక్షించేందుకు ఈ విధానం అమల్లోకి తోచ్చారు. సిబ్బంది పోర్టల్‌లో ఆధార్‌ నంబరు అనుసంధానించి ఫేస్‌ రీడింగ్‌ ద్వారా హాజరు వేయాల్సి ఉంటుంది. యాప్‌లో సాంకేతిక లోపాలతో సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తోంది. హుజూరాబాద్‌ మండలంలోని చెల్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 11 ఉప ఆరోగ్య కేంద్రాలు ఉండగా 20 మంది ఏఎన్‌ఎంలు, 10 ఎంఎల్‌హెచ్‌పీ వైద్యులు, 12 వైద్య సిబ్బంది ఉన్నారు. వీరంతా అబాస్‌లో విధిగా హజరు నమోదు చేయాలనే నిబంధనలు ప్రవేశపెట్టారు. ఆక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా హాజరును పరిగణనలోకి తీసుకుంటారు.

ఫ సాంకేతిక లోపాలు

అబాస్‌ హాజరు విధానంలో పలు సాంకేతిక సమస్యలు చోటు చేసుకుంటున్నాయి. పీహెచ్‌సీ సిబ్బంది సైతం నిర్దేశిత పోర్టల్‌లో ఈ విధానంలో హజరు వేసుకోవడానికి యత్నిస్తే నమోదు కావడం లేదు. పీహెచ్‌సీలో ఉన్నా కేంద్రానికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్నట్లు నమోదవుతోంది. దీంతో సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. క్షేత్ర స్థాయి సిబ్బంది హాజరు వేసుకోవాలంటే మొదట వారు సంబంధిత పీహెచ్‌సీకి వెళ్లాలి. అక్కడ హజరు పడిన తర్వాత ఉప కేంద్రానికి, ఉప కేంద్రం నుంచి మరో మూరుమూల గ్రామానికి వెళ్లాలి. సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తోంది. సమయమంతా ప్రయాణానికే సరిపోతుంది. పీహెచ్‌సీలో ఉండి విఽధులు నిర్వహించే వైద్యులు, ఇతర సిబ్బంది సైతం ఆ కేంద్రంలో ఉండి ఈ విధానంలో హజరు వేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.

ఫ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం...

-డాక్టర్‌ మధు, పీహెచ్‌సీ వైద్యులు, చెల్పూర్‌

నెట్‌ వర్క్‌ సంకేతాలు, ఇతర సాంకేతిక సమస్యలతో అబాస్‌ హజరు విధానంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. నిర్ణయం రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - Sep 08 , 2025 | 12:54 AM