Karimnagar: అమరవీరుల స్మృతివనం ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:54 PM
భగత్‌నగర్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అమరవీరుల పేరుతో ప్రభుత్వం స్మృతివనం ఏర్పాటు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.
- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి
- తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
భగత్‌నగర్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అమరవీరుల పేరుతో ప్రభుత్వం స్మృతివనం ఏర్పాటు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు కరీంనగర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటలో అసువులు బాసిన అమరవీరుల కోసం హైదరాబాద్‌లో స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరిస్తే బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వచ్చినా హైదరాబాద్ (తెలంగాణ)రాష్ట్రానికి స్వాతంత్య్రం రాలేదన్నారు. నిజాం పరిపాలన అంతం కోసం సాయుధ రైతాంగ పోరాటానికి బద్దం ఎల్లారెడ్డి, రావినారాయణరెడ్డి, ముక్దుం మొయునుద్దీన్‌లు పిలుపునిచ్చారన్నారు. కమ్యునిస్టులు చేస్తున్న ఉద్యమం ఉదృతం కావడంతో ఆనాటి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానాన్ని దేశలో విలీనం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, అందెస్వామి, పొనగంటి కేదారి, కసిరెడ్డి మణికంఠరెడ్డి, కొయ్యడ సృజన్‌కుమార్, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బ్రామండ్లపల్లి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ నగరంలో భారీ బైక్ ర్యాలీ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా సీపీఐ నాయకులు నగరంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబరు 11 నుండి 17 వరకు నిర్వహించనున్న వారోత్సవాల్లో భాగంగా కోతిరాంపూర్‌లోని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పిలుపునిచ్చిన అగ్రనేతల్లో ఒకరైన బద్దంఎల్లారెడ్డి విగ్రహానికి చాడ వెంకట్‌రెడ్డితో పాటు, పంజాల శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి విగ్రహం నుంచి సీపీఐ కార్యాల యం, కమాన్, బస్టాండ్, తెలంగాణచౌక్, వెంకటేశ్వర దేవాలయం ముందు అనభేరి విగ్రహం వరకుబైక్ ర్యాలీ నిర్వహించి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.