Share News

‘కాళేశ్వరం’ కుంగింది బీఆర్‌ఎస్‌ హయాంలోనే..

ABN , Publish Date - Sep 08 , 2025 | 12:44 AM

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని, కుంగింది కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ విమర్శిం చారు.

‘కాళేశ్వరం’ కుంగింది బీఆర్‌ఎస్‌ హయాంలోనే..

వేములవాడ టౌన్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని, కుంగింది కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ విమర్శిం చారు. వేమలవాడ అర్బన్‌ మండలం అగ్రహారం ఫంక్షన్‌ హాల్‌లో మిడ్‌మానేరు నిర్వాసితులు 1550 మందికి ప్రత్యేక ప్యాకేజీ కింద ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మానికి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాతో కలిసి ఆది శ్రీనివాస్‌ హాజర య్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. దానిపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని గుర్తుచేశారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ వంటి అనేక మందితో కలిసి నిరసనలు వ్యక్తం చేశామని గుర్తు చేశారు. వెనుకబడిన వేములవాడను అభివృద్ధి చేయాలని అనేక ధర్నాలు చేశామని అన్నారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో వెనుకబడిన వేములవాడను ముందుకు తీసుకువెళుతున్నామని వివరించారు. రూ.240 కోట్లతో ముంపు గ్రామాల ప్రజలకు 4696 ఇల్లు మంజూరు చేశామని వెల్లడించారు. ప్రత్యేక ప్యాకేజి కింద ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అందరికి న్యాయం చేయాలని ప్రభుత్వం ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియని అన్నారు. అర్హులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. నిర్వాసితుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. కష్టాలు ఉన్న వారి వెంట కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. కొందరు కాళేశ్వరం లేకుంటే నీళ్లు లేవని ఫ్లెక్సీలు కడుతు న్నారని, వాళ్లను ఏమని అనాలో అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. ఈ సంవత్సరం కాళేశ్వరంలోని మేడిగడ్డ వద్ద అసలు నీరే ఆపలేదని, అన్నారం, సుందిళ్ల వద్ద బుంగలు పడి చుక్కనీరు నిలవ లేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కట్టిన ప్రాజెక్టు వారి హయాంలోనే కుంగిపోయిందని, దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదని గుర్తు చేశారు. ప్రాజెక్టులో చుక్కనీరు ఆపకున్నా కొందరు రాజకీయ పబ్బం గడుపుకునేందుకు, రైతులన తప్పుదోవ పట్టించ డానికి ఫ్లెక్సీలు అక్కడక్కడా కడుతున్నారని విమర్శించారు. గతంలో ప్రజలను బస్సుల్లో తరలించి కాళేశ్వరం ప్రాజెక్టు చూపిం చినట్లుగా, ఇప్పుడు బస్సుల్లో ప్రజలను తరలించి కుంగిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను చూపెట్టాలని సవాల్‌ విసిరారు. అప్పుడు ప్రజ లు వాస్తవాలు గ్రహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమం లో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ రొండి రాజు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పిల్లి కనుక య్య కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రం రాజు, గాలిపెల్లి స్వామి తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 12:44 AM