కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం..
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:34 AM
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ రూరల్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్, అర్బన్ మండలాల కు సంబంధించిన కార్యకర్తలు నాయకులతో నిర్వహించిన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు ఎన్నికల్లో పెద్దపీట వేసేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీ రిజర్వేషన్లు కల్పించా రన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాలను పట్టించుకోవ ద్దన్నారు. వారి దిగజారి మాట్లాడే మాటలు వారి ఓటమిని వారే ఒప్పుకున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసిక ట్టుగా పనిచేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధించాల న్నారు. రానున్న 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉంటుందని అందరికీ తప్పకుండా అవకాశాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీని వాస్, నాయకులు పాల్గొన్నారు.
రుద్రంగి : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రుద్రంగిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నా రు. మండల కేంద్రంలో ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నా హక సమావేశం నిర్వహించగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సారఽథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం నిదులు ఖర్చు చేస్తోందన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పని చేసి కాంగ్రెస్ పార్టీ ఆభ్యర్ధుల విజయానికి కృషి చేయాలన్నారు. రుద్రంగి బిడ్డగా గెలిచి అనేక నిధులు తీసుకువచ్చామన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూం జలపతి, గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, గండి నారాయ ణ, కేసిరెడ్డి నర్సారెడ్డి, మాడిశేట్టి అభిలాష్ తర్రె లింగం, జక్కు మోహన్, జక్కుల లక్ష్మినారాయణ, ఆకుల గగన్, ఎర్రం ఆరవింద్, చెలుకల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.