Share News

కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్టుల ధర్నా

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:34 AM

జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్‌ జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 252ను సవరిం చాలంటూ శనివారం కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్టుల ధర్నా

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్‌ జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 252ను సవరిం చాలంటూ శనివారం కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేశారు. తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు లాయక్‌ పాషా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన జర్నలిస్ట్‌లతో కలిసి నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్‌ ఏవోకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సామల గట్టు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 12:34 AM