ఎస్సీ వర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
ABN , Publish Date - Mar 14 , 2025 | 01:16 AM
ఎస్సీ వర్గీకరణ అనంతరం ఉద్యోగ నియామ కాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తర్రి శంకరయ్య అన్నారు.

చందుర్తి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ అనంతరం ఉద్యోగ నియామ కాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తర్రి శంకరయ్య అన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేపట్టిన నిరసన దీక్ష గురువారం కొనసాగింది. ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లింగంపల్లి బాబు మాదిగ, నాయకులు ఆవునూరి రాజు మాదిగ, లింగంపల్లి శంకర్, లింగంపల్లి బాబు, నేరళ్ల దేవయ్య మాదిగ, వర కుమార్, డప్పుల రవీందర్, కాదాసు రాజయ్య, మల్యాల రాజయ్య తది తరులు పాల్గొన్నారు.