Share News

తెలంగాణ ఉద్యమానికి జయశంకర్‌ జీవితం అంకితం..

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:40 AM

తెలంగాణ ఉద్య మానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ అని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు.

తెలంగాణ ఉద్యమానికి జయశంకర్‌ జీవితం అంకితం..

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఉద్య మానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ అని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి స్వరాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ అని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణనే ఆశ, శ్వాసగా జీవించి ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారని కొని యాడారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పోరాడి మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధనకు మార్గదర్శనంగా నిలిచారని అన్నారు. జయశంకర్‌ సార్‌ మన మధ్యలో లేనప్పటికి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు తమ వంతూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, డీపీఅర్‌వో వంగరి శ్రీధర్‌, జిలా యువజన సర్వీస్‌ శాఖ అధికారి రాందాస్‌, మైనింగ్‌ ఏడీ క్రాంతికుమార్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు రాంచందర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని సర్ధాపూర్‌ 17వ పోలీస్‌ బెటాలియన్‌లో జయంతి వేడుకలను నిర్వహించారు. కమాండెంట్‌ ఎంఐ సురేష్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌ జగదీశ్వర్‌రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘ కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. సెస్‌ చైర్మన్‌ చిక్కా ల రామారావు, ఎండీ రామసుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 12:40 AM