jagitiala : చింతకుంట చెరువు దగ్గర నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:36 AM
జగిత్యాల అర్బన్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం సద్దుల బతుకమ్మను జరుపుకోనున్నారు. ఆదివారం జగిత్యాల పట్టణంలో మున్సిపల్ అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు.
నేడు సద్దుల బతుకమ్మ
జగిత్యాల అర్బన్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం సద్దుల బతుకమ్మను జరుపుకోనున్నారు. ఆదివారం జగిత్యాల పట్టణంలో మున్సిపల్ అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. పట్టణంలోని చింతకుంట చెరువు, మోతె చెరువు వద్ద మహిళలు బతుకమ్మ నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి వీలుగా ప్రధాన కూడళ్ల వద్ద మ్యాట్‌లు ఏర్పాటు చేశారు. చింతకుంట మోతె చెరువు వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు పరిసరాలను విద్యుత్ కాంతులతో నింపారు. దీంతో చింతకుంట చెరువు, మోతె చెరువు ప్రాంతమంత అందంగా అలంకరించిన విద్యుత్ కాంతులతో మెరుస్తున్నాయి. పట్టణంలోని అన్ని ప్రాంతాలలో బతుకమ్మ ఆడే మహిళలు నిమజ్జనానికి మోతె చెరువు, చింతకుంట చెరువు వద్దకు రానుండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పండగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు.