Share News

బంగారు పతకాన్ని సాధించడం హర్షనీయం

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:32 AM

జిల్లా శిశు సంక్షేమా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న మిట్టపల్లి అర్చన ఇటీవల శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ త్రోబాల్‌ పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని సాధిం చడం హర్షనీయమని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం అన్నారు.

బంగారు పతకాన్ని సాధించడం హర్షనీయం

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లా శిశు సంక్షేమా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న మిట్టపల్లి అర్చన ఇటీవల శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ త్రోబాల్‌ పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని సాధిం చడం హర్షనీయమని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం అన్నారు. కలెక్టరేట్‌లో ని జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో మంగళవారం అర్చనను అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సన్మించారు. జిల్లా సంక్షేమ శాఖలోని మహిళా సాధికా రిత విభాగంలో పని చేస్తున్న దివ్యాంగురాలైన మిట్టపల్లి అర్చన శ్రీలంకలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా జరిగిన త్రోబాల్‌ పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి పట్టుదలతో దేశం తరఫున ఆడి విజయం సాధించిందని గుర్తు చేశారు. దివ్యాంగులకు ప్రోత్సాహం ఇస్తే అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తారని మహిళా సాధికరికత కేంద్రం కోఆర్డినేటర్‌ రోజా తెలిపారు. అర్చన ఎంతో పట్టుదలతో క్రమశిక్షణతో ఈ ఘనతను సాధించిందని ఏసీడీపీవో సుచరిత పేర్కొన్నారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్‌ కోఆర్డినేటర్‌ స్రవంతి.సఖీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 12:32 AM