అక్రమ ఇసుక రవాణాకు తెర తీసింది బీఆర్‌ఎస్ పార్టీనే
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:34 AM
అక్రమ ఇసుక రవాణాకు తెర తీసింది బీఆర్‌ఎస్ పార్టీనే అని పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో ఇసుక క్వారీలే లేవని, బీఆరెస్ ప్రభుత్వ హయాంలో నిత్యం వందలాది లారీలతో ఇసుకను తరలించారని విమర్శించారు.
జమ్మికుంట, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): అక్రమ ఇసుక రవాణాకు తెర తీసింది బీఆర్‌ఎస్ పార్టీనే అని పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో ఇసుక క్వారీలే లేవని, బీఆరెస్ ప్రభుత్వ హయాంలో నిత్యం వందలాది లారీలతో ఇసుకను తరలించారని విమర్శించారు. లారీల రాకపోకలతో పంట పొలాలు, రోడ్లు ధ్వంసమయ్యాయని గుర్తు చేశారు. గ్రామాల ప్రజలు అడ్డుకున్నా బెదిరించి ఇసుక అక్రమ వ్యాపారం సాగించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇసుక వ్యాపారం సాగడం లేదన్నారు. ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన హుజూరాబాద్ ఎమ్మెల్యే మాటలు విని మాజీ మంత్రులు ఇక్కడకు రావడం భాదకరమన్నారు. చెక్‌డ్యామ్ నిర్మాణానికి స్టీల్ వాడలేదని, పక్కా నాసిరకంగా కట్టారని, గతంలో ఆయా గ్రామాల ప్రజలు ఈ విషయంపై కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారని తెలిపారు. ఎక్కడివో పాత వీడియోలు చూపించి చెక్‌డ్యామ్‌ను పేల్చి వేశారని పదేపదే చెప్పినా ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. రెండు రోజుల్లో ఎస్‌ఎఫ్‌ఎల్ రిపోర్ట్ వస్తుందని, వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో సుంకరి రమేష్, ఎర్రం సతీష్‌రెడ్డి, ఎరబెల్లి రాజేశ్వర్‌రావు, పూదరి రేణుక-శివకుమార్, ఇంగిలె రామరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.