రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:43 AM
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వం రేషన్ కార్డులు అందజేస్తోందని, ప్రభుత్వ పథకాల లబ్ధికి రేషన్‌కార్డు కీలకమని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు.
- కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వం రేషన్ కార్డులు అందజేస్తోందని, ప్రభుత్వ పథకాల లబ్ధికి రేషన్‌కార్డు కీలకమని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మణికంఠ ఫంక్షన్ హాలులో అధికారులు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హాజరై మాట్లాడారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల తొలగింపు, నమోదును చేసుకునే అవకాశం ఉందని అన్నారు. మండలంలో మొత్తం 1,494 నూతన రేషన్ కార్డులను జారీ చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణీకమని అన్నారు. రేషన్ కార్డు లేని నిరుపేదల దరఖాస్తు చేసుకుంటే విచారణ జరిపి వారికి అందజేస్తామని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్‌పర్సన్ సబేరాబేగం, పౌర సరఫరాల శాఖ డీఎం రజిత, పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ అధికారి శ్రీలత, డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ, ఆర్‌ఐ శ్రవణ్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, మాజీ సర్పంచులు వెంకట్‌రెడ్డి, బాల్‌రెడ్డి, శంకర్, రవీందర్, నాయకులు సాహెబ్, గిరిధర్‌రెడ్డి, బాబు, తిరుపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, రాజేందర్, రవీందర్, శ్రీనివాస్, బాలయ్య, విజయ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, వివిధ శాఖ అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.