రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:46 AM
అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
తంగళ్లపల్లి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం తంగళ్లపల్లి మండలం బద్దనపల్లిలోని ఎస్‌ఎస్ గార్డెన్స్‌లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అర్హులైన 1397 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులతో పాటు 2224 మంది కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసి అందిస్తున్నామని వెల్లడించారు. ప్రజల జీవనంలో రేషన్ కార్డు చాలా కీలకమైందని ఆధార్ కార్డు, కరెంటు కనెక్షన్ ప్రభుత్వ పథకాల అమలులో కీలకమని అన్నారు. ప్రతి లబ్ధిదా రుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. నూతన రేషన్ కార్డు ద్వారా ఇంది రమ్మ ఇళ్లు, పింఛన్ వంటి అనేక సంక్షేమ పఽథకాలకు అర్హత వస్తుం దని స్పష్టం చేశారు. రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రేషన్ కార్డుల ఊసే ఎత్తలేదని ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రేషన్ కార్డులు ఆందిస్తున్నామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. ఇంది రమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ, కుటుంబ సభ్యుల పేర్లు నమోదు, రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ, రూ.500లకే గ్యాస్ సిలిం డర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, మహిళా శక్తి కింద క్యాంటీన్లు, మిల్క్ పార్లర్, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్, ఫర్టిలైజర్ దుకాణాలు, ఇతర స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూపతిరుపతిరెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీడబ్ల్యువో లక్ష్మీరాజ్యం, తహసీల్దార్ జయంత్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ నేరళ్ల నర్సింగం గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు జల్గం ప్రవీణ్ కుమార్, డైరెక్టర్లు పొన్న ల పర్శరాములు, ఆరెపెల్లి బాలు తదితరులు పాల్గొన్నారు.