రేషన్ కార్డుల జారీ మరింత ఆలస్యం
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:03 AM
కొత్త రేషన్ కార్డుల జారీ మరింత ఆలస్యం కాను న్నది.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
కొత్త రేషన్ కార్డుల జారీ మరింత ఆలస్యం కాను న్నది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిం చేందుకు పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది సర్వే చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. జిల్లాలో 40 వేలకు పైగా దర ఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిని పరిశీలించనున్నారు. ప్రజాపాలన గ్రామ, పట్టణ సభల ద్వారా 32,174 దరఖాస్తులు రాగా, మీ సేవా కేంద్రాల ద్వారా 8 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్ చేశారు. ఈ వివరాల న్నింటినీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక యాప్‌నకు అనుసంధానం చేశారు. ఈ యాప్‌లో దరఖాస్తుదారుడి పేరు ఎంటర్ చేయగానే వారి వివరాలు అన్ని యాప్‌లో కనబడతాయి. గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది. పట్ట ణాల్లో మున్సిపల్ సిబ్బంది దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి పరిశీలించనున్నారు. వారి ఆదాయ స్థితిగతులు, గతంలో రేషన్ కార్డు ఉందా, తల్లిదండ్రుల పేరిట గల రేషన్ కార్డులో పేర్లు ఉన్నాయా లేదా తదితర అంశా లపై సర్వే చేయనున్నారు. వారు చెప్పిన అంశాలను యాప్‌లో నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియ ముగి సే వరకు మరో నెల రోజులు పట్టవచ్చని తెలుస్తున్నది. కొత్త కార్డుల జారీ కోసం జనవరిలో నిర్వహించిన గ్రామ, పట్టణ సభలకు ముందు పరిశీలన చేసినప్పటికీ, ఆ తర్వాత దరఖాస్తులు వెల్లువలా రావడంతో మరో సారి పరిశీలనకు ప్రత్యేక యాప్ రూపొందించారు. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని దరఖాస్తుదారులు నిరీక్షించాల్సి వస్తున్నది.
జనవరి 26న కొందరికే కొత్త రేషన్ కార్డులు..
జనవరి 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ప్రయోగాత్మకంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన ఆ గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి 1200 వరకు రేషన్ కార్డులను జారీ చేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో మిగతా వారికి కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజా పాలన గ్రామ, వార్డుసభల్లో 16 వేలకు పైగా దరఖా స్తులు వచ్చాయి. ఆ దరఖాస్తుల గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత నవంబర్‌లో నిర్వహించిన కులగణన సర్వే సందర్భంగా మొత్తానికే రేషన్ కార్డులు లేని కుటుంబాలు 15,255 ఉన్నట్లు గుర్తించారు. ఈ ఏడాది జనవరి 22, 23, 24 తేదీల్లో నిర్వహించిన గ్రామసభల్లో రేషన్ కార్డులు లేని కుటుంబాల వివరా లను చదివి వినిపించారు. అంతకు ముందు క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. గ్రామసభల్లో తమ పేర్లు లేవని అనేక మంది ఆందోళనకు గురయ్యారు. దీంతో మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిం చారు. ఆ తర్వాత మీసేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కార్డుల జారీ ప్రక్రియ నిలిచి పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసి నెల రోజులు గడిచినా కూడా కార్డులు జారీ చేయలేదు. రేషన్ కార్డులు లేక అనేక మంది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నారు. అన్ని పథకాలకు రేషన్ కార్డుతో ముడిపెట్టారు. తాజాగా ఈ నెల నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పం పిణీ చేస్తుండడంతో ఆ బియ్యం కూడా కోల్పోవాల్సి వస్తున్నది. కార్డుల జారీ కోసం ప్రభుత్వం మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసేందుకు ప్రత్యేక యాప్ తీసుకరావడంతో ఆలస్యం కానున్నదని అర్హులు ఆందోళనకు గురవుతున్నారు.