ఎండిపోతున్న పంటలకు సాగు నీరు అందించాలి
ABN , Publish Date - Mar 14 , 2025 | 01:15 AM
పంటలు చేతికొ చ్చే సమయంలో నీళ్లు లేక ఎండిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టిం చుకోకపోవడం శోచనీ యమని, ఇప్పటికైనా పంటలను కాపాడాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణిలు డిమాండ్ చేశారు.

సిరిసిల్ల రూరల్, మార్చి 13 (ఆంధ్రజ్యో తి) : పంటలు చేతికొ చ్చే సమయంలో నీళ్లు లేక ఎండిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టిం చుకోకపోవడం శోచనీ యమని, ఇప్పటికైనా పంటలను కాపాడాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణిలు డిమాండ్ చేశారు. సిరిసిల్ల అర్బన్ పరిఽధిలోని చిన్నబోనాల, పెద్దబోనా ల గ్రామాల్లో నీళ్లు లేకపోయిన వరిపంట లను గురువారం సాయంత్రం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి నష్టపోయి న రైతులను ఓదార్చారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం డ్యాంను మరమ్మతులు చేయించకుండా రాష్ట్ర ప్రభు త్వం డ్రామాలు ఆడుతోందన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌పై కక్షతోనే మిడ్‌మానేరులోకి వచ్చిన నీటిని కిందకు వదిలేసి ఈ ప్రాంతంలో నీళ్లు లేకుండా కుట్రలు పన్నుతోందన్నారు. రైతులు అప్పు లుచేసి సాగుచేసిన పంటలు ఎండిపోవడం తో ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభు త్వం వెంటనే నీళ్లు లేక నష్టపోయిన పంట లకు ఎకరానికి రూ 50వేల చోప్పున నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాల న్నారు. లేకుంటే రైతులతో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ము న్నూరు కాపు సంఘం అధ్యక్షుడు అగ్గిరా ములు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మ న్‌లు ఎరవెళ్లి వెంకటరమణారావు, బండారి శ్యాం, బుర్ర మల్లికార్జున్, పోచవేణి ఎల్ల య్యయాదవ్, మాజీ కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.