సమర్థవంతంగా సాగునీరందించాలి
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:39 AM
రబీలో పంటలు కాపాడే నేపథ్యంలో ప్రాజెక్ట్‌ల నుంచి విడుదల చేసే సాగునీటిని సమర్థవంతంగా అందించడంతో పాటు అధి కారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులు కోరారు.

సిరిసిల్ల కలెక్టరేట్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): రబీలో పంటలు కాపాడే నేపథ్యంలో ప్రాజెక్ట్‌ల నుంచి విడుదల చేసే సాగునీటిని సమర్థవంతంగా అందించడంతో పాటు అధి కారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులు కోరారు. సిరిసిల్ల జిల్లా కలెక్ట రేట్‌లో సోమవారం జరిగిన వీడియో కాన్ఫ రెన్స్‌లో వారు మాట్లాడారు. నీరు లేక పంట లు ఎండిపోతున్నట్లుగా తెలుస్తుందని ప్రస్తు తం ఉన్న పరిస్థితులను ఇరిగేషన్, వ్యవసా య అధికారులు పరిశీలించి కలెక్టర్‌కు నివే దికలు అందిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. నీరు లేక పంటలు ఎండిపోవడాన్ని తగ్గించా లని అన్నారు. రాష్ట్రంలో నీటి కోరత ఉన్నం దున నీటి సరఫరాను సమర్థవంతంగా పం పిణీ చేసేందుకు నీటి పారుదల, రెవెన్యూ, శాఖల అధికారులు సమన్వయంతో పనిచే యాలని అన్నారు. కలెక్టర్ వ్యవసాయం, ఇరిగేషన్, విద్యుత్ అధికారులతో సమన్వ యం చేసుకుంటూ పంట నష్టాలను తగ్గిం చాలని అధికారులు, క్షేత్ర స్థాయిలో పర్యటిం చాలని ఆదేశించారు. సాగునీరు సరఫరా కాలువల ద్వారా చేరని ప్రాంతాల్లో నిరాటం కంగా విద్యుత్ సరఫరా చేసి పంటలకు నీరు అందేలా చూడాలని అన్నారు. రాబోయే 15 రోజుల్లో నీటి పారుదల శాఖ అధికారులతో అవసరమైన నీటి విడుదలను కట్టుదిట్టంగా చేస్తూ పంటలను కాపాడే బాధ్యతలను కలెక్టర్ తీసుకోవాలని సూచించారు. భూ గర్భ జలాలు తగ్గిపో వడం, బోర్లు ఎండి పోవడం వల్ల ఎక్క డైనా సాగునీటి ఇబ్బందులు ఉన్నా యో పరిశీలించాలని అన్నారు. పంటలు కోతకు వచ్చే వరకు వ్యవసాయ అధికా రులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పరిస్థితులను ఎప్పటి కప్పుడు నీటి పారుదల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదికలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్‌కమార్ ఝా, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఇరిగేషన్ ఈఈ కిషోర్, జిల్లా వ్యవసాయ అధికారి అప్జల్‌భేగం, జిల్లా ఉద్యానవన అధికారి లత, తదితరులు పాల్గొన్నారు.