Share News

రైతుల్లో పెట్టుబడి సంబురం

ABN , Publish Date - Jun 18 , 2025 | 01:28 AM

వానాకాలం పంటల సాగుకు భరోసా అందిస్తూ పెట్టుబడి సాయం డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. తొమ్మిది రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. తొలి విడత డబ్బులు ట్రెజరీకి చేరడంతో పాటు రైతు ఖాతాల్లోనూ జమ కావడం మొదలైంది. రైతు భరోసా విడుదల కావడంతో జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

రైతుల్లో పెట్టుబడి సంబురం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

వానాకాలం పంటల సాగుకు భరోసా అందిస్తూ పెట్టుబడి సాయం డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. తొమ్మిది రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. తొలి విడత డబ్బులు ట్రెజరీకి చేరడంతో పాటు రైతు ఖాతాల్లోనూ జమ కావడం మొదలైంది. రైతు భరోసా విడుదల కావడంతో జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. రైతు భరోసా కింద ఎకరానికి రూ 6 వేల చొప్పున మొదటగా 5 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు కొత్త పట్టాదారులకు భరోసా అందించే దిశగా ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిలాల్లో 13 మండలాల్లోని 175 క్లస్టర్లలో రైతు భరోసా కింద 1,39,690 మంది రైతులకు రూ.153 కోట్ల 28 లక్షల 81వేల264 పెట్టుబడి సాయం అందజేసే విధంగా నిర్లయించారు. ఇందులో భాగంగా ట్రెజరీల్లో డబ్బులు జమ చేశారు.

ఫ మొదటి విడతగా రూ 99.61 కోట్లు..

జిల్లాలో రైతు భరోసా కింద మొదటి విడత జిల్లా ట్రెజరీ ద్వారా 1,10,424 మంది రైతుల ఖాతాల్లో రూ 99 కోట్ల 61 లక్షల 65వేల241 పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్నారు. మంగళవారం జిల్లాలో 76,974 మంది రైతుల ఖాతాల్లో రూ.43 కోట్ల 22లక్షల 42 వేల 859 జమ అయ్యయి. జిల్లాలో గత యాసంగిలో 70.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ 70 కోట్ల 3 లక్షల 39వేల 286 జమ చేశారు. ఈసారి పూర్తిస్థాయిలో రైతులందరికీ భరోసా వస్తుందనే ఆశతో ఉన్నారు.

ఫ కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు..

కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతులకు సైతం రైతు భరోసా అందించనున్నారు. ప్రభుత్వం ఈ సంవత్సరం జూన్‌ 5 వరకు కొత్తగా పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు పొందిన వారు ఈనెల 20 వరకు భరోసా కోసం దరఖాస్తులు చేసుకునే వీలు కల్పించారు. కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన వారి సమగ్రమైన సమాచారాన్ని ఆన్లైన్‌లో వ్యవసాయ అఽధికారులు సంబంధిత ఖాతా నంబర్‌ పట్టాదారుడిగా నిర్ధారించుకున్న తర్వాత అప్లోడ్‌ చేస్తారు. బ్యాంకు ఖాతాలు పట్టాదారు పుస్తకం మొదటి పేజీ పోర్టల్‌లో నమోదు చేస్తారు. సమగ్రమైన వివరాలు ఇచ్చిన తర్వాత కొత్తవారికి రైతు భరోసా అందిస్తారు.

ఫ వానాకాలం సాగు 2.43 లక్షల ఎకరాలు

జిల్లాలో వానాకాలంలో 2 లక్షల 43 వేల 783 ఎకరాల్లో వివిధ పంటలు సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఇందులో వరి లక్షా 84 వేల 860 ఎకరాలు, పత్తి 49,760 ఎకరాలు, పెసర 79 ఎకరాలు, కందులు 1,155 ఎకరాలు, జొన్నలు 14, మొక్కజొన్న 1,600 ఎకరాలు, ఇతర పంటలు 6,304 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. మండలాల వారీగా చూస్తే.. గంభీరావుపేటలో 19,330 ఎకరాలు, ఇల్లంతకుంటలో 38,470 ఎకరాలు, ముస్తాబాద్‌లో 25,250 ఎకరాలు, సిరిసిల్లలో 5,883 ఎకరాలు, తంగళ్లపల్లిలో 22,031 ఎకరాలు, వీర్నపల్లిలో 8,792 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 21,130 ఎకరాలు, బోయినపల్లిలో 21,310 ఎకరాలు, చందుర్తిలో 21,610 ఎకరాలు, కోనరావుపేటలో 23,700 ఎకరాలు, రుద్రంగిలో 10,105 ఎకరాలు, వేములవాడ 10,578 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 15,614 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో వరి 1.84 లక్షల ఎకరాలు, పత్తి 49,760 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పెసర 79 ఎకరాలు, కందులు 1,155 ఎకరాలు, మొక్కజొన్న 1,600 ఎకరాలు, జొన్నలు 14 ఎకరాలు, ఇతర పంటలు 6,304 ఎకరాలు సాగుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం జిల్లాలో రైతుల కోసం 56,568 క్వింటాళ్ల వరి విత్తనాలు, పెసర 4.08 క్వింటాళ్లు, మొక్కజొన్న 27.04 క్వింటాళ్లు పత్తి 1,28,650 ప్యాకేట్లు కందులు 122.5 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని సిద్ధం చేశారు. వానాకాలం సాగులో ఎరువులు 56,060 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇందులో యూరియా 25,370 మెట్రిక్‌ టన్నులు, డీఎపీ 3,460 మెట్రిక్‌టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 22,390 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 4,115 మెట్రిక్‌ టన్నులు ఎస్‌ఎస్‌పీ 725 మెట్రిక్‌ టన్నులు ఉపయోగించనున్నారు.

వానాకాలం పంటలులో అందించే రైతు భరోసా..

మండలం రైతులు పెట్టుబడి సాయం (రూపాయల్లో)

గంబీరావుపేట 13,385 12,91,43,629

ఇల్లంతకుంట 18,640 23,27,85,269

ముస్తాబాద్‌ 15,358 17,70,40,629

సిరిసిల్ల 5,059 3,79,66,179

తంగళ్లపల్లి 14,038 14,71,00,612

వీర్నపల్లి 4,566 4,44,47,230

ఎల్లారెడ్డిపేట 13,243 13,45,63,236

బోయిన్‌పల్లి 11,375 13,06,75,983

చందుర్తి 10,767 13,22,93,955

కోనరావుపేట 13,449 15,27,00,635

రుద్రంగి 3,885 5,12,68,317

వేములవాడ 7,440 6,64,32,129

వేములవాడరూరల్‌ 8,485 9,64,63,461

మొత్తం 1,39,690 153,28,81,264

Updated Date - Jun 18 , 2025 | 01:28 AM