Share News

అంతర్రాష్ట సైబర్‌ మోసగాడి అరెస్ట్‌

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:29 AM

ఇనస్టాగ్రామ్‌ ద్వారా నిరుద్యోగుల వివరాలను సేకరించి దుబాయ్‌ పంపిస్తానని మోసం చేస్తున్న ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని కాకినాడ ప్రాంతానికి చెందిన డానియల్‌ కెవిన ఎడ్విన అనే సైబర్‌ మోసగాడిని శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ తెలిపారు.

అంతర్రాష్ట సైబర్‌ మోసగాడి అరెస్ట్‌
వివరాలు వెల్లడిస్తున్న జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌

- ఇనస్టాగ్రామ్‌ లో నిరుద్యోగుల వివరాలు సేకరించి దుబాయ్‌ పంపిస్తానని మోసం

వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘుచందర్‌

జగిత్యాలరూరల్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఇనస్టాగ్రామ్‌ ద్వారా నిరుద్యోగుల వివరాలను సేకరించి దుబాయ్‌ పంపిస్తానని మోసం చేస్తున్న ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని కాకినాడ ప్రాంతానికి చెందిన డానియల్‌ కెవిన ఎడ్విన అనే సైబర్‌ మోసగాడిని శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ తెలిపారు. శనివారం జగిత్యాల రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఇనస్టాగ్రామ్‌ ద్వారా సారంగాపూర్‌ మండలానికి చెందిన నవీన అనే నిరుద్యోగి వివరాలను డానయల్‌ కెవిన కెడ్విన సేకరించాడు. అనంతరం ఫోన చేసి దుబాయ్‌ పంపిస్తానని నవీనను నమ్మించాడు. దీంతో నవీన దుబాయ్‌ వెళ్లేందుకు డానియల్‌ కెవిన ఎడ్వినకు బ్యాంక్‌ ద్వారా విడతలవారీగా 8,40,000 రూపాయలను పంపించాడు. ఎన్ని రోజులు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన నవీన సారంగాపూర్‌ పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశాడు. దీంతో జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్‌ ఆదేశాల మేరకు డీఎస్పీలు రఘుచందర్‌, వెంకరటమణ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేపట్టారు. నిందితుడిని సారంగాపూర్‌ మండలంలోని కోనాపూర్‌ శివారులో జగిత్యాల రూరల్‌ సీఐ సుధాకర్‌ తన సిబ్బందితో కలిసి శనివారం పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ, కేరళ, కర్ణాటక, జమ్మూకాశ్మీర్‌ రాషా్ట్రలకు చెందిన సుమారు ఐదుగురు వ్యక్తులను సైతం నిందితుడు మోసం చేశాడని డీఎస్పీ రఘుయందర్‌ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్‌పోన్స, క్రెడిట్‌కార్డు డెబిట్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకున్న జగిత్యాల రూరల్‌ సీఐ సుధాకర్‌, ఎస్సై గీత, పోలీసు సిబ్బందిని ఎస్పీ అశోక్‌కుమార్‌ అభినందించారు.

Updated Date - Nov 23 , 2025 | 12:29 AM