Share News

విద్యుత్‌ అంతరాయం లేకుండా ఇంటర్‌ లింకింగ్‌ వ్యవస్థ

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:42 PM

విద్యుత్‌ వినియోగదారులకు మరింత నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ సరఫరాలో భాగంగా ఇంటర్‌ లింక్‌ లైన్‌ వ్యవస్థను (ప్రత్యామ్నాయ లైన్లు) ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ మేక రమేష్‌బాబు తెలిపారు.

విద్యుత్‌ అంతరాయం లేకుండా ఇంటర్‌ లింకింగ్‌ వ్యవస్థ
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఈ మేక రమేష్‌బాబు

గణేశ్‌నగర్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వినియోగదారులకు మరింత నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ సరఫరాలో భాగంగా ఇంటర్‌ లింక్‌ లైన్‌ వ్యవస్థను (ప్రత్యామ్నాయ లైన్లు) ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ మేక రమేష్‌బాబు తెలిపారు. మంగళవారం డీఈలు, ఏడీలు, ఏఈలు, కాంట్రాక్టర్లతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు, మెయింటెనెన్‌ ్స సమయంలో, ఇతర కారణాలతో సరఫరా నిలిచిపోతే 33 కేవీ ఇంటర్‌ లింక్‌ లైన్‌ వ్యవస్థతో విద్యుత్‌ అందించవచ్చన్నారు. దీని వల్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగదన్నారు. కరీంనగర్‌ సర్కిల్‌ పరిధిలో ఉన్న 173 33/11 కేవీ సబ్‌ స్టేషన్లలో.. 23 33/11 కేవీ లైన్లలో ఇంటర్‌ లింకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 11:42 PM