నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:34 AM
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అవసరమని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.
- ఎస్పీ అశోక్ కుమార్
కోరుట్ల, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అవసరమని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. పట్టణంలోని వివిధ ప్రదాన కూడలీలో 123 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేయగా పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను మెట్‌పల్లి డీఎస్పీ ఎ రాములుతో కలిసి ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో చోరీలు, గొడవలు, రోడ్డు ప్రమాదాల వంటి ఘటనల్లో నిందితుల కదలికలను గమనించి కేసులను త్వరగా ఛేదించవచ్చన్నారు. కోరుట్ల పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకారం అందించిన వ్యాపార వాణిజ్య సంస్థ సభ్యులను ఎస్పీ అభినందించారు. అంతకు ముందు ఎస్పీకి కోరుట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ బాబు, ఎస్‌ఐ చిరంజీవి, రామచంద్రుడు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు పట్టణంలోని వ్యాపార వాణిజ్య సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు
మెట్‌పల్లి టౌన: డివిజన పరిధిలో శాంతి భద్రతాల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మెట్‌పల్లి సబ్‌డివిజన పోలీస్ కార్యాలయాన్ని ఎస్పీ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డ్స్‌ను, పరిసరాలను తనిఖీ చేశారు. డీఎస్పి కార్యాలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన బుక్, కైరం రికార్డు, రిజిస్టర్ లను పరిశీలించారు. సబ్ డివిజన పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. గంజాయి రవాణా, విక్రయించే వారిపై నిగా ఏర్పాటు చేసి తరచూ తనిఖీలు నిర్వహించి గంజాయిని సమూలంగా రూపుమాపేందుకు చర్యలు తీసుకోవా లన్నారు. కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ రాములు, డీసీఆర్‌బీ ఇనెస్పెక్టర్ శ్రీనివాస్, మెట్‌పల్లి, కోరుట్ల సీఐలు అనిల్‌కుమార్, సురేష్ బాబు, ఎస్సైలు కిరణ్ కుమార్, అనిల్, రాజు, చిరంజీవి, శ్రీధర్‌రెడ్డి, నవీన, రామచంద్రం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.