Share News

జిల్లా రవాణా శాఖ అధికారుల తనిఖీలు

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:38 AM

జిల్లా కేంద్రం శివారు ప్రాంత ప్రధాన రహదారులలో శుక్రవారం జిల్లా రవాణా శాఖ అధికారులు వాహనాల ను తనిఖీలు చేశారు.

జిల్లా రవాణా శాఖ అధికారుల తనిఖీలు

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రం శివారు ప్రాంత ప్రధాన రహదారులలో శుక్రవారం జిల్లా రవాణా శాఖ అధికారులు వాహనాల ను తనిఖీలు చేశారు. నిబంధనాలకు విరుధంగా నడుపుతున్న పది వాహనా లను గుర్తించి అధికారులు సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఇంచార్జి అధికారి గంధం వంశీధర్‌ మాట్లాడుతూ సరైన పత్రాలు లేని వాహ నాలు, అధిక లోడ్‌ తీసుకెళ్తున్న వాహనాలను సీజ్‌ చేశామన్నారు. టాక్సీ, ఫిట్నె స్‌, పొల్యూషన్‌, పర్మింట్‌ సర్టిఫికెట్లను వాహనాల వెంట పెట్టుకోవాలని వాహ నదారులకు సూచించామన్నారు. టాక్సీ కట్టని వాహనాలకు 200శాతం ఫైన్‌ విధిస్తామని హెచ్చరించారు. ద్విచక్రవాహనాలు, కార్ల పరిమితి 15 సంవత్సరా లు దాటిన సొంత వాహనాలకు గ్రీన్‌టాక్సీ చెల్లించి ఐదు సంవత్సరాలకు అను మతులను పునరుద్ధరించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో సొంత వాహనా లు కారు, ద్విచక్రవాహనాలను సీజ్‌ చేస్తేమన్నారు. ప్రతి వాహనానికి, ట్రాక్టర్ల ట్రైలర్‌లకు ముందువెనకాల తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లు ఉండాలని లేకుం టే రూ.1000 నుంచి రూ.2000 జరిమానా విధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ పృథ్వీరాజ్‌, కానిస్టేబుల్‌ ప్రశాంత్‌, సౌమ్య, రమ్మ పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 12:38 AM