ఎరువుల నిల్వలు, విక్రయాల తనిఖీ
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:36 AM
తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని కోఆపరేటి వ్ సొసైటీస్ జాయింట్ రిజిస్ట్రా ర్, ఎరువుల తనిఖీ ప్రత్యేకాధికా రి ఎస్‌వీ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీచేశారు.
తంగళ్లపల్లి, జూలై 25 (ఆం ధ్రజ్యోతి): తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని కోఆపరేటి వ్ సొసైటీస్ జాయింట్ రిజిస్ట్రా ర్, ఎరువుల తనిఖీ ప్రత్యేకాధికా రి ఎస్‌వీ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీచేశారు. వ్యవసాయ ఉత్ప త్తుల కమిషనర్, రాష్ట్ర కార్యదర్శి ఆదేశాల మేరకు కరీంనగర్, రా జన్న సిరిసిల్ల జిల్లాలో ఎరువు లు, నిలువలు, విక్రయాలపై తనిఖీ అధికారిగా ఎస్‌వి ప్రసాద్‌ను నియమించారు. దీంట్లో భాగంగా శుక్రవారం నేరెళ్ల ప్రాథమీక వ్యవసా య సహకార సంఘాన్ని పరిశీలించి ఎరువుల నిల్వల రికార్డులను తనిఖీ చేశారు. గోదాంలోనే నిల్వ ఉన్న ఎరువులను పరిశీలించారు. ఈ తనిఖీలో జిల్లా సహకార అధికారి టి రామకృష్ణతో పాటు ప్యాక్స్ చైర్మన్ కోడూరి భాస్కర్‌గౌడ్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రమాదేవి, సంఘం కార్యదర్శి అజయ్, సిబ్బం ది అంజయ్య, రాజయ్య, సాయిలు ఉన్నారు.