ఈవీఎం గోదాముల తనిఖీ
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:30 AM
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ని సర్ధాపూర్ వ్యవసాయమార్కెట్ యార్డులో గోదాముల్లో ఉన్న ఎలక్ర్టానిక్ ఓటిం గ్ మిషన్(ఈవీఎం)లను బుధవారం ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గీతేలతో కలిసి ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్‌రెడ్డి పరిశీలించా రు.
సిరిసిల్ల రూరల్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ని సర్ధాపూర్ వ్యవసాయమార్కెట్ యార్డులో గోదాముల్లో ఉన్న ఎలక్ర్టానిక్ ఓటిం గ్ మిషన్(ఈవీఎం)లను బుధవారం ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గీతేలతో కలిసి ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్‌రెడ్డి పరిశీలించా రు. సాధరణ ఎన్నికల తనిఖీల్లో భాగంగా సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌కు వచ్చిన ఎన్నికల సంఘం సీఈవో సదర్శన్‌రెడ్డికి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతేలు పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు, ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వ హణపై జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌తో చర్చించారు. అనంతరం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంలో భధ్రత పరిచిన ఈవీఎంలను రాజకీయ ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్ధార్ మహేష్‌కుమార్, ఎన్నికల సెక్షన్ అధికారి రెహమాన్ పాల్గొన్నారు.