Share News

సైదాపూర్‌లో కోర్టు ఏర్పాటుకు భవణాల పరిశీలన

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:04 AM

సైదాపూర్‌ మండల కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేసేందుకు పలు ప్రభుత్వ భవణాలను హుజూరాబాద్‌ కోర్ట్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి పీబీ కిరణ్‌కుమార్‌ శుక్రవారం పరిశీలించారు.

సైదాపూర్‌లో కోర్టు ఏర్పాటుకు భవణాల పరిశీలన

సైదాపూర్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): సైదాపూర్‌ మండల కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేసేందుకు పలు ప్రభుత్వ భవణాలను హుజూరాబాద్‌ కోర్ట్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి పీబీ కిరణ్‌కుమార్‌ శుక్రవారం పరిశీలించారు. సైదాపూర్‌లోని ఎస్టీ హాస్టల్‌, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గల పాత ఎమ్మార్వో ఆఫీస్‌ భవణాలను పరిశీలించారు. కోర్టు ఏర్పాటుకు స్థానికుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ సైదాపూర్‌లో కోర్టు ఏర్పాటు చేసేందుకు హైకోర్ట్‌ ఆదేశాల మేరకు రెండు భవణాలు పరిశీంచామని నివేదికను హైకోర్ట్‌కు అందజేస్తామన్నారు. సైదాపూర్‌లో కోర్టు ఏర్పాటు చేయడంతో కేసుల సత్వర పరిష్కారానికి దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌, న్యాయవాదులు అందె వెంకటేశ్వర్‌రావు, కామని సమ్మయ్య, మట్టెల తిరుపతి, బీంరావ్‌, హరిహరణ్‌, తహసీలాఽ్దర్‌ గుర్రం శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నాయకులు గుండారపు శ్రీనివాస్‌, ములుపాల రవీందర్‌, మిట్టపెల్లి కిష్టయ్య, లంకదాసరి మల్లయ్య, గడ్డం శేకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 12:04 AM