కొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:33 AM
కొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య అన్నారు.
భగత్‌నగర్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): కొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య అన్నారు. కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో నిర్వహిస్తున్న బాల వైజ్ఞానిక మేళాను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పరిసరాలను నిశితంగా పరిశీలించాలన్నారు. సమాజంలోని సమస్యలను గుర్తించడం ద్వారా వాటికి పరిష్కార మార్గాలను కనుగొనేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యాబోధన ప్రణాళికల్లో శాస్త్రీయ దృక్పథానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. జిల్లా సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయి వైజ్ఞానిక మేళాకు విశేష స్పందన లభిస్తున్నదన్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 2,652 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి ఎస్ భగవంతయ్య, సెక్టోరియల్ అధికారులు కర్ర అశోక్‌రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, కృపారాణి, కొత్తపల్లి, గంగాధర, సైదాపూర్, గన్నేరువరం ఎంఈవోలు తుమ్మ ఆనందం, ఏనుగు ప్రభాకర్‌రెడ్డి, కట్ట రవీంద్రాచారి, రామయ్య, గాజుల రవీందర్, స్తంభంకాడి గంగాధర్ పాల్గొన్నారు.