మూతపడుతున్న పరిశ్రమలు తెరిపించాలి
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:44 AM
టెక్స్ టైల్ పార్కులో మూత పడుతున్న పరిశ్రమలను తెరిపించాలని తెలంగాణ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ డిమాండ్ చేశారు.
తంగళ్లపల్లి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): టెక్స్ టైల్ పార్కులో మూత పడుతున్న పరిశ్రమలను తెరిపించాలని తెలంగాణ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి టెక్స్‌టైల్ పార్కును సంద ర్శించి కార్మికులతో సమావేశమయ్యారు. అనంత రం రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్ల మొదటిగా ఏర్పడిన టెక్స్‌టైల్ పార్క్‌లోని పరిశ్రమలు మూతబడడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితమేన ని విమర్శించారు.20 సంవత్సరాల క్రితం వేలాది మందికి ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ పార్కులో నేడు కేవలం 200 మంది కార్మికు లకు కేడా ఉపాధి కల్పించకుండా పోతుందన్నారు. టెక్స్‌టైల్ పార్కు పరిశ్రమలకు విద్యుత్తు సబ్సిడీ అందక, మార్కెట్ సౌకర్యం లేక, ప్రాసెసింగ్ డైనింగ్ యునిట్లను ఏర్పాటు చేయకపోవడంతో ఇతర రాష్ట్రా ల పవర్‌లూమ్ పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్న గుడ్డకు పోటీ తట్టుకోలేక సంక్షోభంలో కూరుకుపోతుంద న్నారు. పార్కులో పరిశ్రమలు మూత పడుతుండడం వల్త చుట్టు పక్కల ఉన్నటువంటి 5 వేల కార్మిక కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందనీ ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నార న్నారు. విదేశాల నుంచి పరిశ్రమలను ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణలో ఉన్నటు వంటి పరిశ్రమల పట్ల పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవ లంబిస్తున్నాడని మండిపడ్డాడు. కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్‌కు నేతన్నల ఓట్లు కావాలే తప్ప పరి శ్రమ అభివృద్దికి కృషి చేయలే దని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి టెక్స్‌టైల్ పార్కులో నెలకొన్న సమస్యలు పరిష్కరించి కార్మికు లకు ఉపాధి కల్పించాలని అన్నా రు. తక్షణమే ప్రభుత్వం పార్కు లో ప్రభుత్వ వస్త్రాల ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు ఉపాధి కల్పిం చాలని కార్మికులందరికి కనీస వేతనం రూ26 వేలు వచ్చేలా కూలీ నిర్ణయించి పిఎఫ్, ఈఎస్ ఐ, బోనస్ సౌకర్యాల కల్పిం చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలం గాణ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, సిపిఎం సీనియర్ నాయకులు మిట్టపల్లి రాజమౌళి, పార్కు అధ్యక్షుడు కూచన శంకర్, నాయకులు గడ్డం రాజశే ఖర్, జెల్ల సదానందం, అకుబత్తిని శ్రీకాంత్, రాజమ ల్లు, రమేష్, ప్రభాకర్, వేణు, మనోహర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.