అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు..
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:38 AM
అర్హులైన నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): అర్హులైన నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని కందికట్కూర్ గ్రామానికి చెందిన తాళ్ళపెల్లి లావణ్యకు మంజూరైన ఇంది రమ్మ ఇంటి భూమిపూజ కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. తొలి విడతలో మండలంలో 805మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు ఇచ్చామన్నారు. ఇళ్లు మంజూరు అయినవారు ఆలస్యం చేయకుండా పనులు ప్రారంభించాలని సూచించారు. దసరాలోపు నిర్మాణాలు పూర్తిచేసి గృహప్రవేశాలు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుక కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. ఇంటి నిర్మాణానికి విడుతల వారిగా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయ ని, దళారులను ఎవరు ఆశ్రయించ వద్దన్నారు. మండల కాంగ్రెస్ అధ్య క్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మా జీ ఎంపీపీ గుడిసె అయిలయ్యయాదవ్, జ్యోతి, ముత్యం అమర్, తిరుపతి, సత్యం, విజయ్, సంతోష్, కొమురయ్య, రజనీకాంత్ పాల్గొన్నారు.