Share News

ఇందిరమ్మ ఇళ్లతో ప్రజల జీవితాల్లో వెలుగులు

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:33 PM

ఇందిరమ్మ ఇళ్లు ప్రజ ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లతో ప్రజల జీవితాల్లో వెలుగులు

వేములవాడ టౌన్‌, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్లు ప్రజ ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం వేములవాడ మండలంలోని మారుపాక గ్రామంలో తుమ్మల సంగీత, వంశీల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో భాగంగా లబ్ధి దారులకు నూతన వస్త్రాలు అందజేసి రిబ్బన్‌ కట్‌చేసి శుభాకాంక్షలు తెలి పారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వం లో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కలలు సాకారం అవుతున్నాయన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ దొబ్బల మల్లేశం, ఉపసర్పంచ్‌ జ్యోతి, కాంగ్రెస్‌ పార్టీ వేములవాడ మండల అధ్యక్షులు పిల్లి కనుకయ్య, సీనియర్‌ నాయకు లు ముడికె చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 11:33 PM