Share News

వేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:16 AM

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఇన్‌చార్జి కలె క్టర్‌ గరిమా అగర్వాల్‌ తెలిపారు.

వేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు

తంగళ్లపల్లి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఇన్‌చార్జి కలె క్టర్‌ గరిమా అగర్వాల్‌ తెలిపారు. తంగళ్లపల్లి మండల పరిషత్‌ కార్యా లయం ఆవరణలో హౌసింగ్‌ శాఖ నిర్మించిన మోడల్‌ హౌస్‌తో పాటు మండేపల్లి, చింతలపల్లి, రాళ్లపేట, అంకిరెడ్డిపల్లె గ్రామాల్లో మొత్తం 11 ఇందిరమ్మ ఇళ్లు పూర్తికాగా గురువారం గృహ ప్రవేశాలు నిర్వహిం చారు. కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రేస్‌ పార్టీ ఇన్‌చార్జి కేకే మహేం దర్‌రెడ్డిలు హాజరై ప్రారంభించారు. గృహ ప్రవేశాలు జరుపుకున్న కుటుంబాలకు కేకే మహేందర్‌రెడ్డి నూతన దుస్తులు అందించి శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వా ల్‌ మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కల నేరవేర్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలుచేస్తోందన్నారు. ఆయా గ్రామా ల్లో ఇండ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. మిగతా లబ్ధిదారులు అందరూ ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. అనంత రం కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ధ్యేయమని అ న్నారు. అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని, ఆందోళన చేందవద్దని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెల్ము ల స్వరూప తిరుపతిరెడ్డి, వైస్‌చైర్మన్‌ నేరెళ్ల నర్సింగంగౌడ్‌, తహసీల్దార్‌ జయంత్‌, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జల్గం ప్రవీణ్‌, నాయకులు గడ్డం నర్సయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, నాయకులు సత్తు శ్రీనివాస్‌రెడ్డి, మచ్చ శ్రీనివాస్‌, లింగాల భూపతి, మునిగెల రాజు, పొన్నం లక్ష్మణ్‌గౌడ్‌, జుపె ల్లి రాజేశ్వర్‌రావు, చుక్క శేఖర్‌, కట్కం రాజశేఖర్‌, గణాది కిషన్‌ తది తరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇంటి బిల్లు ఇప్పించండి..

ఇందిరమ్మ ఇంటి బిల్లు ఇప్పించాలని లబ్ధిదారులు మసరకంటి వెం కటలక్ష్మి-ఎల్లయ్య దంపతులు ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ ముం దు మోకరిల్లారు. రాళ్లపేటలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి కాలి నడకను ఇన్‌చార్జి కలెక్టర్‌తో పాటు కాంగ్రెస్‌ నాయకులు వెళుతుండగా బాధిత దంపతులు ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా పడుకుని బిల్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు తేరుకుని వారిని పక్కకు తీసుకపోయారు. ఈ విషయంపై ఆరాతీయగా 562 గజాల లోపు ఇంటి నిర్మాణం ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం లేదని బిల్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను వివరణ కోరగా ఆధార్‌కార్డు నంబరు తప్పుగా నమోదు అయ్యిందని ఉన్నాతాధికారుల కు నివేదించినట్లు, నెలరోజుల్లోపు సమస్య పరిష్కారమవుతుందన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 12:17 AM