Share News

ఇందిరమ్మ ఇళ్లు పేద ల ఆత్మగౌరవానికి ప్రతీక

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:52 AM

ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు పేద ల ఆత్మగౌరవానికి  ప్రతీక

వేములవాడ టౌన్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు నూతన కడప ఏర్పాటుకు చీర, సారెతో ఆది శ్రీనివాస్‌ బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో చాలా ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, ఇప్పటికే బేస్మెంట్‌ పూర్తిచేసుకుని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందని తెలిపారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ఒక్క డబుల్‌ బెడ్రూం ఇల్లు నిర్మాణం చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినట్లుగా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి చీర, సారెతో వస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్నానని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి చీర, సారెతో వచ్చానని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 12:53 AM