Share News

మూడు నెలల్లో ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేయాలి

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:48 AM

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు మూడు నెలల్లోగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచిం చారు.

మూడు నెలల్లో ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేయాలి

సిరిసిల్ల జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు మూడు నెలల్లోగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచిం చారు. గురువారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పొంది న సిరిసిల్ల నియోజకవర్గంలోని వివిధ మండలాల లబ్ధిదారులు కలెక్టరేట్‌కు తరలివచ్చి కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిర మ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. మంజూరు పత్రాలు పొందిన వారికి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుం దని వెల్లడించారు. సిమెంట్‌, స్టీల్‌ ధరలు తగ్గించేలా ఏర్పాట్లు చేస్తుందని వివరించారు. నిర్మాణానికి డబ్బులు లేని మహిళా సంఘా ల సభ్యులకు గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా పట్టణాల్లో మెప్మా ద్వారా రూ లక్ష రుణం అందిస్తామని తెలిపారు. త్వరగా ఇళ్లు మొదలు పెట్టాలని సూచించారు. బేస్మెంట్‌, ఇతర దశలు పూర్తి కాగానే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డ్‌ ఆఫీస ర్లతో ఫొటో తీయించి, అప్లోడ్‌ చేయించాలని పేర్కొన్నారు. దీంతో ప్రభు త్వం నుంచి డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. దీనికి ఎవరి పైరవీ అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభు త్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో హౌసింగ్‌ పీడీ శంకర్‌, వివిధ మండలాల మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 12:49 AM