పేదవారి ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:38 AM
పేదవారి ఆత్మ గౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
కోనరావుపేట, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): పేదవారి ఆత్మ గౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు గృహ ప్రవేశం సంద ర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజే శారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం ధ్యేయంగా ముందుకు పోతుందని అన్నారు. ఇప్పటికే నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపా రు. గ్రామాల్లో ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే తప్ప గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా కట్టించలేదని విమర్శించారు. రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇల్లులేని ఊరు చూపిస్తే మేము ఓట్లు అడగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేని ఊరు మేం చూపిస్తాము మీరు ఓట్లు అడగ కుండా ఉండాలి అని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మేం చేసిన సవాళ్లను స్వీకరించలేదని పేర్కొన్నారు. ఆనాడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారు సంతోషంగా తాము పదిలంగా అల్లుకున్న ఇందిరమ్మ ఇల్లు అని ఆనందంతో అంటున్నారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఆనాడు చేసినట్లుగా శనివారం గృహ ప్రవేశ సమయంలో నూతన వస్త్రాలు పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కోనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, చందన గిరి గోపాల్, గొట్టే రుక్మిణి, మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, తాళ్లపల్లి ప్రభాకర్, పాక్స్ చైర్మన్ బండ నర్సయ్య, సాసాల శ్రీనివాసరెడ్డి, కచ్చకాయల బాల్‌రెడ్డి, ఉప్పుల గంగయ్య, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.