Share News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:56 AM

జిల్లా వ్యాప్తంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మంది రంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఎంపీడీవోలు, హౌసింగ్‌ అధి కారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 1413 ఇళ్లు గ్రౌండింగ్‌ కాగా, మిగతావి కూడా గ్రౌండింగ్‌ చేయాలన్నారు. జిల్లాలోని ఆయా గ్రామాల వారిగా కేటాయించిన ఇళ్లు ఇప్పటివరకు గ్రౌండింగ్‌పై అడిగి తెలుసుకు న్నారు. ఇళ్ల మార్క్‌ ఔట్‌లో ఉత్తమ పనితీరు చూపుతున్న పంచాయతీ కార్యదర్శులను అభినందించారు. పేదలకు సొంత ఇంటి కల నేరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసి చేస్తోందన్నారు. మొదటి విడతలో ఇంటి స్థలాలు ఉన్న వారికి రూ 5లక్షలు ఆర్థిక సహాయాన్ని నాలుగు దశల్లో అందజేస్తుందన్నారు. 400చదరపు అడు గుల నుంచి 600 చదరపు అడుగుల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంద న్నారు. ఇళ్ల మంజూరు పత్రాలు పోందిన వారికి ఇసుక ఉచితంగా అంది స్తుందన్నారు. గ్రామాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను పంచాయతీ కార్యదర్శు లు నిత్యం పరిశీలించి వివరాలను అందించాలని ఆదేశించారు. ఈ సమావే శంలో డీఆర్‌డీవో శేషాద్రి, హౌజింగ్‌ పీడీ శంకర్‌, డీపీవో షర్బుద్దీన్‌, డీఎల్పీ వో నరేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 12:56 AM