ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:38 AM
గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల నిర్మాణ పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు.
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల నిర్మాణ పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. మండల కేంద్రంతో పాటు రాచర్లగుండారం, నారాయణపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్లు, తరగతి గదుల నిర్మాణ పనులను శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. దశల వారిగా పనులు పూర్తయిన వెంటనే డబ్బులను ప్రభుత్వం నేరుగా ఖాతాల్లో జమ చేస్తోందన్నారు. ఏమైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాచర్లతిమ్మాపూర్- రాచర్లగుండారం గ్రామాల మధ్య ఇటీవల కురిసిన వర్షాలకు ధ్వంసమైన రహదారిని పరిశీలించారు. సీసీ రోడ్డు మంజూరు చేసి మరమ్మతు పనులు చేయించాలని ఎంపీడీవో సత్తయ్యను ఆదేశించారు. ఏఎంసీ చైర్‌పర్స న్ సబేరాబేగం, గృహ నిర్మాణ శాఖ పీడీ శంకర్, తహసీల్దార్ సుజా త, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సయ్య, మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.