Share News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:46 AM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికాలను ఆదేశించారు. బుధవారం మండలంలోని గుమ్లాపూర్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను, గ్రామ పంచాయతీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
గుమ్లాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

చొప్పదండి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికాలను ఆదేశించారు. బుధవారం మండలంలోని గుమ్లాపూర్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను, గ్రామ పంచాయతీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి దశల వారీగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. మంజూరైన ఇళ్లు బెస్‌మెట్‌ లెవల్‌కు చేరాలన్నారు. ఏమైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం గుమ్లాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ పమేలా సత్పతి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె ఓపీ రికార్డులను తనిఖీ చేసి వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల ఆధార్‌, పోన్‌ నంబర్లను సేకరించాలని, ఆయుష్మాన్‌ భారత్‌ రిజిస్ర్టేషన్లు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఎంపీడీవో వేణుగోపాల్‌, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:46 AM