ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై నిత్యం సమీక్షించాలి
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:12 AM
జిల్లాలో ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై ఎంపీడీవోలు ప్రతిరోజు సమీక్షిం చాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, నవంబర్ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై ఎంపీడీవోలు ప్రతిరోజు సమీక్షిం చాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. కలెక్టరేట్ లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై జిల్లాలోని జడ్పీ సీఈవో, ఆర్డీవోలు, మండ ల ప్రత్యేక అధికారులు, ఎంపీడీ వోలు ఇతర శాఖల అధికారుల తో ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ ర్వాల్ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. సొంత ఇంటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిర మ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని, దీనిలో భాగంగా లబ్ధి దారులకు నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థిక సహాయం మంజూరుచేస్తోందన్నారు. ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక ఇబ్బం దులు పడుతున్న మహిళా సంఘాల సభ్యులకు డీఆర్‌డీవో, మెప్మా నుంచి ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. ఇసుక ఇబ్బందులు ఉంటే తహసీల్దా ర్‌తో ఆయా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్‌లు మాట్లాడాలని ఆదేశిం చారు. తమ పరిధిలోని ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకోవాలన్నారు. ప్రతి ఎంపీడీవో తమ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులతో ఇందర మ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై రోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు. హౌసింగ్ పీడీ, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు తమ మండలాల్లో ఇళ్ల నిర్మా ణాల పురోగతిని పరిశీలించాలని ఆదే శించారు. హౌసింగ్ ఇతర అధికారు లు తమ పరిధిలో ఇళ్ల ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని, పూర్తి అయిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించేం దుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. త్వరగా తమ సొంత ఇంటి కలను పూర్తి చేసుకునేలా అధికారులు లబ్ధిదా రులను ప్రోత్సహించాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ పీడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.