Share News

దళితులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

ABN , Publish Date - Jun 30 , 2025 | 12:43 AM

రోడ్డు వెడల్పు లో భాగంగా ఇళ్లను కోల్పోయిన గోదావరిఖని అడ్డగుం టపల్లి దళిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, సీపీఐ సీనియర్‌ నాయకుడు కందుకూరి రాజరత్నం డిమాండ్‌ చేశారు.

దళితులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి
బాధితులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

గోదావరిఖని జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రోడ్డు వెడల్పు లో భాగంగా ఇళ్లను కోల్పోయిన గోదావరిఖని అడ్డగుం టపల్లి దళిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, సీపీఐ సీనియర్‌ నాయకుడు కందుకూరి రాజరత్నం డిమాండ్‌ చేశారు. ఇళ్లను కోల్పోయిన సీనియర్‌ జర్నలిస్టు, దళిత నాయకుడు బొంకూరి మధు, మరో నలుగురు బాధిత కుటుంబాలను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, సీపీఐ సీనియర్‌ నాయకు డు కందుకూరి రాజరత్నంతో పాటు పలువురు బీఆర్‌ ఎస్‌, సీపీఐ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ నాయకులు ఆది వారం పరామర్శించారు. ఈ సందర్భంగా చందర్‌ మాట్లాడుతూ మాస్టర్‌ ప్లాన్‌ పేరిట విధ్వంసం సృష్టిస్తూ బీదలను మరింత బీదలుగా మార్చేందుకు స్థానిక శాసనసభ్యుడు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అడ్డగుంటపల్లిలోని అబ్దుల్‌ కలాం విగ్రహం నుంచి కళ్యాణ్‌నగర్‌ చౌరస్తా వరకు ఒక సైడు రోడ్డు పూర్తయి రెండు నెలలు కావస్తున్నా కావాలనే నిరుపేదలైన బొంకూరి మధు, మరో నాలుగు కుటుంబాల ఇళ్లను కూల్చి వేయించారని, ఇది సరైన విధానం కాదన్నారు. వాస్తవాలు మాట్లాడితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడు తున్నారని, మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి కోసం, రోడ్డు వెడల్పునకు ఎవరు వ్యతిరేకులు కారన్నారు. ఇళ్లు కోల్పోయిన అడ్డగుంటపల్లి గ్రామ మాదిగలకు తక్షణమే ఇందిరమ్మ ఇండ్లలో అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. పరామర్శించిన వారిలో బీఆర్‌ఎస్‌ నాయకులు నారాయణదాసు మారుతి, నీరటి శ్రీనివాస్‌, వెంకటేష్‌ గౌడ్‌, సీపీఐ నాయకులు శనిగరం చంద్రశేఖర్‌, బహుజన్‌ సమాజ్‌ పార్టీ నాయకులు రవికుమార్‌ ఉన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 12:43 AM