Share News

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:33 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందు తాయని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రేకుర్తి బుడిగె జంగాల కాల నీలో ఇందిరమ్మ ఇళ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ప్రొసీడింగ్స్‌ అందజేస్తున్న నరేందర్‌రెడ్డి

భగత్‌నగర్‌, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందు తాయని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రేకుర్తి బుడిగె జంగాల కాల నీలో ఇందిరమ్మ ఇళ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇస్తా మని చెప్పి మాట నిలబెట్టుకోలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం భూమి ఉన్న చివరి లబ్ధిదారుడి వరకు ఇల్లు మంజూరు చేస్తుందన్నారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో ఆలస్యమైనందున అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందించారు. లబ్ధి దారులు తుర్పాల పోచవ్వ, పర్వతం స్వప్న, కళ్లెం అం జవ్వ, చింతల లక్ష్మి, అస్తపురం రమేష్‌, పర్వతం మల్లే శం, అస్తపురం తిరుమల మ్యాకల శ్రీనివాస్‌, దుబ్బుల రాజయ్య, లింగంపల్లి లచ్చయ్య పాల్గొన్నారు.

ఓటు చోరీపై సంతకాల సేకరణ

ఓటు చోరీపై పలు డివిజన్లలో కాంగ్రెస్‌ ఆధ్వ ర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సంద ర్భంగా సుడా ఛైర్మన్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ దేశ వ్యాప్తంగా చేస్తున్న ఓటు చోరీని అరికట్టడానికి రాహుల్‌గాంఽధీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు అవుతున్నారన్నారు. మల్కా పూర్‌లోని 16వ డివిజన్‌లో బొమ్మ ఈశ్వర్‌గౌడ్‌, డివిజన్‌ అధ్యక్షుడు కాశిపాక శంకర్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో మడుపు మోహన్‌, శ్రవన్‌నాయక్‌, పండుగ సాయి, కొక్కు సందీప్‌, గొర్రె పోచమల్లు, బొమ్మ సత్యనారాయణ, తొర్తి శ్రీనివాస్‌, కాసారపు ఎల్లాగౌడ్‌, తొర్తి మహేష్‌ పాల్గొన్నారు.

ఫ 20వ డివిజన్‌లో అస్తపురం రమేష్‌ లత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అస్తపురం తిరుమల, పర్వతం మల్లేశం, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, మిర్యాల శ్రీధర్‌రెడ్డి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 11:34 PM