ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక..
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:03 AM
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నేత కార్మికులు తయా రుచేసిన ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్రం లోని మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలు స్తున్నాయని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
సిరిసిల్ల, నవంబరు 22 (ఆంరఽధజ్యోతి) : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నేత కార్మికులు తయా రుచేసిన ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్రం లోని మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలు స్తున్నాయని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని పద్మ నాయక కల్యాణ మండపంలో సిరిసిల్ల నియో జకవర్గంలోని మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా గరిమ అగ్రవాల్ మాట్లా డుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతు లు కల్పన, మరమ్మతుల పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని తెలి పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండోరోజు నుంచే మహి ళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలి పారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరిట ఇస్తున్నామని వివరించారు. ప్రతి ప్రభుత్వ పథకం అమలులో మహిళల కు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. వారి ఆర్థిక ప్రగతితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దే శ్యంతో పథకాలకు రూపకల్పన చేస్తున్నారన్నారు. సిరిసిల్ల లో ఇందిరా మహిళాశక్తి చీరలు తయారై రాష్ట్ర మంతా పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. సిరిసిల్లలో 130మ్యాక్స్ సొసైటీలు, ఆరువేల మంది కార్మికులకు ఉపాధి లభించిందని వెల్లడించారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్లు స్వరూపారెడ్డి, విజయ, సాబేరబేగం, రాణి, చైర్మన్ రాములు నాయక్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీవో శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు.