భారతీయ సంస్కృతి, సనాతన ధర్మమే మన బలం
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:38 AM
భారతదేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు పాకిస్తాన్ వంటి ఉగ్రవాద దేశాలు కుట్ర చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
సిరిసిల్ల, నవంబరు 18 (ఆంరఽధజ్యోతి) : భారతదేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు పాకిస్తాన్ వంటి ఉగ్రవాద దేశాలు కుట్ర చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉక్కు మ నిషి సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించు కుని మంగళవారం జిల్లా కేంద్రంలో నెహ్రూ యువ కేంద్రం, మేరా భారత్ ఆధ్వర్యంలో సర్దార్-150 యూనిటీ మార్చ్ పేరిట కార్యక్రమం నిర్వహించా రు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మ హేశ్ తదితరులు పాలొన్నారు. ఒగ్గు డోలు ప్రదర్శన, విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మన సం స్కృతి, సంప్రదాయం, సనాతన ధర్మమే భారతదేశానికి బలమని, మనమ ట్టిలోనే ఆ బలం ఉందన్నారు. కుటుంబ రాజకీయ వారసత్వ రాజకీయాల తో దేశానికి ప్రమాదమని, యువత రాజకీయాల్లోకి రావాల్సిన వచ్చి రాజకీ య సమీకరణలను మార్చాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కుటుం బంలో విబేధాలుంటే పక్కనున్న వాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని లాభం పొందాలనుకుంటారు. అట్లాగే దేశం ఐక్యంగా లేకపోతే... పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి ఉగ్రవాద దేశాలు దేశ ఐక్యతను దెబ్బతీసి విధ్వంసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. భారత్‌ను అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల రూపంలో, పాకిస్తాన్ వంటి ఉగ్రవాద దేశాల రూపంలో మన భారతీయ సనాతన ధర్మానికి, కుటుంబ వ్యవస్థకు పెను ప్రమాదం ఎదురు కాబోతోందన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని. దేశ ప్రజల కోసం సర్దార్ పటేల్ చేసిన త్యాగాలను, కనబర్చిన ధైర్య, సాహసాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఉగ్రవాద మూకల వలలో యువత
కొందరు తెలిసోతెలియక అమాయక యువత పాకిస్తాన్ వంటి ఉగ్రవా ద మూకల వలలో పడి వాళ్ల జీవితాలను, వాళ్ల కుటుంబాల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని సంజయ్ అన్నారు. ఇంకొందరు కార్పొరేట్ కల్చర్ పేరుతో డ్రగ్స్ పబ్ కల్చర్‌కు అలవాటుతో తమ భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్నారని అన్నారు. భారత్‌లో డ్రగ్స్,మద్యం, గంజా యి వంటి వ్యసనాలవల్ల దాదాపు 5.70 కోట్ల మంది నష్టపోతున్నారన్నారు. ఉగ్రవాదం ఉచ్చులో పడి ఏటా వందల మంది బలైపోతున్నారని. గత దశాబ్దంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం ఆర్ధిక ప్రగతి సాధించిందని, ఆర్ధిక ప్రగతిలో 4వ స్థానానికి చేరుకున్నామని, స్వావలంబనలో ఊహించనంతంగా ముందుకు పోతున్నామన్నారు.
యువత రాజకీయాల్లోకి రావాలి..
దేశానికి యువతే బలం. యువతతోనే దేశ ఐక్యత సాధ్యం. కాబట్టి యువత తప్పనిసరిగా రాజకీయాల్లోకి రావాలి. లేనిపక్షంలో కుటుంబ వార సత్వ రాజకీయాలే కొనసాగుతాయని సంజయ్ అన్నారు. యువత రాజకీ యాల్లోకి వచ్చి రాజకీయ సమీకరణలను మార్చడం ద్వారానే దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఐక్యంగా ఉంచగలమన్నారు. ఈనాటి యువత డ్రగ్స్,పబ్, మద్యం, కార్పొరేట్ కల్చర్ వలలో పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, హైదరాబాద్ పాతబస్తీలో ఓ స్కూల్‌ను టార్గెట్ చేసు కుని బాలికలను డ్రగ్స్‌కు అలవాటు చేసి వారి జీవితాలనే నాశనం చేస్తు న్నారని. తెలిసో తెలియక యువత వారి వలలో పడుతున్నారని, ఈ పరి స్థితి మారాలంటే యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిద్దామన్నారు. డ్రగ్స్‌ను ఉక్కుపాదంతో అణచివేసేందుకు మోదీ ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. ఉద్యమంలో యువత భాగస్వాములైతే.. డ్రగ్స్ రహిత దేశం ఎంతో దూరంలో లేదన్నారు.
పటేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి.
యువతకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్‌ను ఆదర్శంగా, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సంజయ్ అన్నారు. దేశంలో ఆ ధునిక సివిల్ సర్వీసెస్ వ్యవస్థను స్థాపించడంలో పటేల్ కీలక పాత్ర పోషించార న్నారు. నేటి యువతకు పటేల్ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయనలోని ఆలో చనలు, ఆశయాలను, క్రమశిక్షణ, దేశభక్తిని ఈనాటి యువత అలవర్చుకో వాల్సిన అవసరం ఉందని, అలాంటి మహనీయుడిని 150 జయంతి సంద ర్భంగా ప్రతిఒక్కరూ స్మరించుకునేలా ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్టోబరు 31 నుంచి నవం బరు 25వరకు సర్దార్-150 ఐక్యతా మార్చ్ పేరిట అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. విద్యార్థులను, యువతతో కలిసి ఎంపీలు,కేంద్ర మం త్రులు పాదయాత్రలు చేస్తున్నారని, జిల్లాలో పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ దేశ ఐక్యత, అభివృద్ధికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారన్నారు. పటేల్ కృషి తోనే దేశంలో వివిధ సంస్థానాలు కలిశాయని వివరించారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మట్లాడుతూ విద్యాశాఖ, ఇంటర్, డిగ్రీ కళాశాల లు, జిల్లా సంక్షేమ శాఖ, పోలీసుల సమన్వయంతో జిల్లాను డ్రగ్స్ రహితం గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. డ్రగ్స్‌తో కలిగే నష్టాలు ఇబ్బందులపై అవగాహన కలిగించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహి స్తున్నామని వివరించారు. దేశ ఐక్యత, అభివృద్ధికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలను కొనియాడారు. ఎస్పీ మహేష్ బీ గితే మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్ వ్యాప్తి చేస్తున్న సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. డ్రగ్స్‌రహిత జిల్లా కోసం ప్రణాళిక ప్రకారం ముందు కు వెళుతున్నామని తెలిపారు. వైద్య కళాశాల విద్యార్థుల సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తానని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ఫ్లాష్ మాబ్ ద్వారా ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమం లో నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి రాంబాబు, ఆర్డీవో వేంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ చంద్రయ్య, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూపరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, వేములవాడ ఇన్‌చార్జి డాక్టర్ చెన్నమ నేని వికాస్‌రావు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతామరామకృష్ణ, డీవై ఎస్‌వో రాందాస్, డీఐఈవో ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.