భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:08 AM
భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని, హైందవ సంస్కృతిలోని వేదా లను ప్రపంచంలోని పలు దేశాలు ఆచరిస్తున్నాయని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ కల్చరల్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని, హైందవ సంస్కృతిలోని వేదా లను ప్రపంచంలోని పలు దేశాలు ఆచరిస్తున్నాయని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రాజరాజేశ్వ ర స్వామి వారి ఆలయంలో అఖాల భారత వేద శాస్త్ర స్మార్త ఆగమ విద్వత్ సదస్సులో భాగంగా నిర్వహించిన చతుర్వేద స్మార్త పరీక్షల్లో ఉత్తీర్ణులైన వేదపండిత విద్యార్థులకు ఆదివారం పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా వేద పండిత విద్యార్థులకు నిర్వహిం చే చతుర్వేద స్మార్త పరీక్షలు వేములవాడ రాజన్న ఆలయంలో నిర్వహిం చడం గర్వకారణమని, అభినందనీయమని కొనియాడారు. హైందవ సంస్కృతిలోని వేదాలను ఇతర దేశాల వారు ఆచరిస్తున్నారని, దేవాల యాలకు రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోందని అన్నారు. రానున్న రోజుల్లో వేద పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య మరింతగా పెరుగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం వేద పండితులకు ఎల్లప్పు డు అండగా ఉంటుందని గుర్తు చేశారు. మన పూర్వీకులు తాలపత్ర గ్రంథాల ద్వారా వేదాలను మనకు అందించారని వివరించారు. గతంలో వేములవాడ రాజన్న ఆలయ చైర్మన్‌గా అనేక అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. రాజన్న ఆలయ విస్తరణ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నా ని, నాలుగుసార్లు శృంగేరి వెళ్లి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులపై పీఠాధిపతులతో చర్చించి ముందుకు వెళుతున్నామన్నారు. రూ. 47 కోట్లతో రోడ్డు వెడల్పు, రూ. 35 కోట్లతో అన్నదాన సత్రం నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. రూ. 150 కోట్లు రాజన్న ఆలయ అభివృద్ధికి కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. రోడ్డు వెడల్పులో నిర్వాసితుల త్యాగం ఎప్పటికి మరువలేనిదన్నారు. భూ నిర్వాసితుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆలోచనలు చేస్తోందని తెలిపారు. వేద పండితులుగా పట్టాలు పొందుతున్న వేద విధ్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పరీక్షాధికారులుగా వ్యవహరించిన వేద పండితులను ఘనంగా సన్మానించి ప్రశంస పత్రా లను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాభాయి ఏఈవోలు, సూపరిండెంట్‌లు తదితరులు ఉన్నారు.