రేపటి నుంచి డిగ్రీ, పీజీ కళాశాలల నిరవధిక బంద్
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:12 AM
నవంబరు 3వ తేదీ నుంచి ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు నిరవధిక బంద్‌లో పాల్గొననున్నట్లు శాతవాహన యూని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్‌కు ప్రైవేటు కళాశాలల యజమానులు మెమొ రాండం అందించారు.
గణేష్‌నగర్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): నవంబరు 3వ తేదీ నుంచి ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు నిరవధిక బంద్‌లో పాల్గొననున్నట్లు శాతవాహన యూని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్‌కు ప్రైవేటు కళాశాలల యజమానులు మెమొ రాండం అందించారు. ఈ సందర్భంగా కళాశాలల యజమానులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కళాశాలల పట్ల భిన్న వైఖరిని అవలంభిస్తుందన్నారు. ఫీజు రీయిం బర్స్‌మెంట్ సాధనలో భాగంగా సోమవారం 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉన్నత విద్యాసంస్థలు నిరవధిక బంద్‌కు ఇచ్చిన పిలుపులో భాగంగా యూని వర్సిటీ పరిధిలో అన్ని డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్ పాటించనున్నట్లు తెలిపారు.
ఫ బీఈడీ కళాశాలల అధ్యాపకుల నిరవధిక సమ్మె
శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలకు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ఎస్‌యుటీఏఏ నాయకులు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు మెమొరాండం అందించారు. నవంబరు 3వ తేదీ నుంచి యూనివర్సిటీ పరిధిలోని 23 బీఈడీ కళాశాలల అధ్యాపకులు సమ్మెకు దిగుతు న్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ టీచర్ ఎడ్యుకేటర్ అసోసియేషన్ అధ్యక్షుడు పీచర వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, తిరుపతి, దేవేందర్, రవినందన్, రాజుకుమార్, షంషేర్ తదితరులు పాల్గొన్నారు.