కేసీఆర్‌పై సీఎం వాఖ్యలు సరికాదు
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:02 AM
మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలు సరికాదని, మహిళలను, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్రంగా ఖండించారు.
కరీంనగర్ టౌన్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలు సరికాదని, మహిళలను, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం నగరంలోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్షేనని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులను ఉద్ధేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన భాష తీరు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. రెండేళ్లలో రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదని, వెకిలిచేష్టలు, బూతులు తప్పితే ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేదని రవిశంకర్ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడిన నీకు కేసీఆర్‌ను విమర్శించే నైతికత, స్థాయి ఉందా ఒక్కసారి ఆలోచించుకోవాలని అన్నారు. అన్ని విషయాలను అసెంబ్లీలో కేటీఆర్, హరీష్‌రావులకు మైక్ కట్ చేయకుండా అసెంబ్లీలో స్పీకర్‌తో అవకాశమిప్పించాలని సవాల్ చేశారు. కేసీఆర్‌పై అనుచిత వాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం తగిన బుద్దిచెబుతుందని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.