Share News

‘పది’లో పెరిగిన ఉత్తీర్ణత

ABN , Publish Date - May 01 , 2025 | 12:35 AM

కరీంనగర్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో జిల్లా ఉత్తమ ఫలితాలను సాధించింది. 97.9 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 96.65 శాతం ఉత్తీర్ణత సాధించి ఏడో స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే ఈసారి 1.25 ఉత్తీర్ణత శాతం పెరిగింది. జిల్లాలో ఈ సంవత్సరం 12,508 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 12,245 మంది ఉత్తీర్ణులయ్యారు. 263 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు.

‘పది’లో పెరిగిన ఉత్తీర్ణత

- రాష్ట్రంలో జిల్లాకు ఆరో ర్యాంకు

- 97.9 శాతం మంది ఉత్తీర్ణత

- మళ్లీ బాలికలదే పై చేయి

కరీంనగర్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో జిల్లా ఉత్తమ ఫలితాలను సాధించింది. 97.9 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 96.65 శాతం ఉత్తీర్ణత సాధించి ఏడో స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే ఈసారి 1.25 ఉత్తీర్ణత శాతం పెరిగింది. జిల్లాలో ఈ సంవత్సరం 12,508 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 12,245 మంది ఉత్తీర్ణులయ్యారు. 263 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. ఉత్తీర్ణత సాధించిన రెగ్యులర్‌ విద్యార్థుల్లో 6,451 బాలురు, 5,794 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలకు 6,616 మంది బాలురు హాజరుకాగా 6,451 మంది పాస్‌ అయ్యారు. 5,892 మంది బాలికలు పరీక్షలు రాయగా వారిలో 5,794మంది ఉత్తీర్ణులయ్యారు. 165 మంది బాలురు, 98 మంది బాలికలు ఫెయిలయ్యారు. 2018-19 విద్యాసంవత్సరంలో 98.38 శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకొని జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది ఆ తర్వాత 2019-20, 2020-21 విద్యాసంవత్సరాల్లో కొవిడ్‌ కారణంగా పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరిని పాస్‌ చేయడంతో 100శాతం ఉతీర్ణత నమోదైంది. 2021-22 విద్యాసంవత్సరంలో 93.34 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 2022-23లో 1.68 శాతం మంది ఎక్కువగా ఉత్తీర్ణులు కావడంతో ఉత్తీర్ణతశాతం 95కి చేరింది. 2023-24లో 96.65శాతంగా పాస్‌ పర్సంటేజీ నమోదైంది.

ఫ జ్యోతిబాపూలే సంక్షేమ గురుకుల పాఠశాలల ఫలితాలు...

ఉమ్మడి జిల్లా పరిధిలో 25 మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉండగా వాటిలో 1614 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1607 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 99.56 శాతం ఫలితాలను సాధించారు. వేములవాడ బాలికల పాఠశాల నుంచి పరీక్ష రాసిన ఎ శివాని 600 మార్కులకుగాను 590 సాధించి జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల విద్యార్థుల్లో మొదటి స్థానంలో నిలిచింది.

Updated Date - May 01 , 2025 | 12:35 AM