Share News

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

ABN , Publish Date - Dec 12 , 2025 | 01:28 AM

తొలివిడుల స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వేములవాడ మండలంలోని చీర్ల వంచ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాన్ని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ గురువారం పరిశీలించారు.

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

వేములవాడ టౌన్‌, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): తొలివిడుల స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వేములవాడ మండలంలోని చీర్ల వంచ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాన్ని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటింగ్‌ సరళిని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఇదేవిధంగా వేములవాడ అర్బన్‌ మండలంలోని మారు పాక, అనుపురం, ఆరెపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ పరిశీలించి అధికారులతో చర్చిం చారు. వీరితో పాటు ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్‌ రాజు, ఎంపీడీవో కీర్తన, తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 01:28 AM