రామగుండం పేరు చెడగొట్టాలని చూస్తే.. సహించేది లేదు
ABN , Publish Date - May 01 , 2025 | 12:39 AM
రామగుండం ప్రతిష్టకు భంగం కలిగించినా, ఈ ప్రాంతానికి నష్టం చేయాలని చూసినా సహించేది లేదని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హెచ్చరించారు.
ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
గోదావరిఖని, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): రామగుండం ప్రతిష్టకు భంగం కలిగించినా, ఈ ప్రాంతానికి నష్టం చేయాలని చూసినా సహించేది లేదని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హెచ్చరించారు. బుధవారం గోదావరిఖనికి చెందిన ప్రైవేట్ వైద్యులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల గోదావరిఖనిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డీఎంహెచ్‌వో కలెక్టర్ పంపారని తనిఖీకి వచ్చారని, తనిఖీ చేసి నివేదికను కలెక్టర్‌కు ఇస్తే బాగుండేదన్నారు. కానీ స్కానింగ్ మిషన్‌కు ఎన్‌ఓసీ అంశంలో వైద్యులు, ఆసుపత్రి ప్రతిష్టకు భంగం కలిగేలా వృత్తినే అవమానించేలా సదరు అధికారి ప్రవర్తించారన్నారు.
అనంతరం ఐఎంఏ అధ్యక్షుడు క్యాస శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరు నెలలుగా డీఎంహెచ్‌వో రామగుండం ప్రాంత వైద్యుల ను వేధిస్తున్నారని, చిన్నచిన్న కారణాలు చెప్పి జరిమానాలు విధిస్తున్నారన్నారు. తాము వామన్‌రావు దంపతులను చంపిన ట్టు చంపుతామని బెదిరించామని చెప్పడం పూర్తిగా అబద్దమన్నారు. సమావేశంలో మాజీ మేయర్, ప్రముఖ వైద్యులు అనీల్‌కు మార్, డాక్టర్ నాగిరెడ్డి, లక్ష్మీవాణి, మడికల్ అసోసియేషన్ ప్రతినిధులు రాజేందర్, భిక్షపతి పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపన..
కళ్యాణ్‌నగర్: రామగుండం ప్రజలను పోతరాజు సహిత పోచమ్మ చల్లగా చూడా లని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్, మనాలీ ఠాకూ ర్ దంపతులు వేడుకున్నారు. బుధవారం బాపూజీనగర్‌లో మాజీ కార్పొరేటర్ మహం కాళి స్వామి, రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్మించి న పోచమ్మ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమా నికి ఎమ్మెల్యే దంపతులు హాజరై హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమం లో పలువురు నాయకులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
గోదావరిఖని: అంతర్గాం మండల పరిధి లోని అక్బర్‌నగర్‌లో ఎన్టీపీసీ యాష్ పాండ్ పైపులైన్ పగిలి ఇళ్లలోకి బూడిద నీరు చేరి కాలనీ మొత్తం ఇటీవల జలమయం అయిం ది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాగూర్ బుధవారం అక్బర్‌నగర్‌ను సం దర్శించి బాధిత కుటుంబాలను పరామర్శిం చారు. అనంతరం ప్రమాదానికి కారణమైన పైప్‌లైన్‌ను పరిశీలించి ఎమ్మెల్యే మాట్లాడా రు. బూడిదతో నష్టపోయిన ఇళ్ల వెనకాల రక్షణ గోడ నిర్మించి మరోసారి ఇలాంటి సం ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకో వాలని ఎన్టీపీసీ అధికారులను ఆదేశించారు. బూడిద బాధిత కుటుంబాలకు ఉపాధి కల్పించాలని కోరారు. స్లాబ్ ఇల్లు నిర్మించుకో వడానికి సిద్ధమైతే తాను ఇందిరమ్మ పథకం లో భాగంగా రూ.5లక్షలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అయోధ్యసింగ్, దీటి బాలరాజు, షేక్ ఇఫ్తేకార్ అహ్మద్, ఏబీసీ శ్రీనివాస్‌రెడ్డి, నాజియా సుల్తానా, ముంతాజ్, ఈదునూరి హరిప్రసాద్, సింగం కిరణ్ గౌడ్, అప్పాసి శ్రీనివాస్ పాల్గొన్నారు.